సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరికి వెళ్లి సమీక్షించాలి..
సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరికి వెళ్లి సమీక్షించాలని రాహుల్ గాంధీ అన్నారు. జడ్చర్ల కార్నర్ మీటింగ్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రసంగించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లు ఒకదాని తర్వాత ఒకటి కుంగిపోతున్నాయని రాహుల్ పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలను పెంచి, లక్ష కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టారని ఆయన ఆరోపించారు. లక్ష కోట్ల రూపాయల ప్రజాధనంతో ప్రాజెక్టును కూడా సరిగా నిర్మించలేకపోయారని విమర్శలు గుప్పించారు. గ్రెస్ పార్టీ నాగార్జున సాగర్, సింగూరు, శ్రీరాంసాగర్, ప్రియదర్శిని జూరాల వంటి అనేక ప్రాజెక్టులను నిర్మించిందని రాహుల్ తెలిపారు.
దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య ఎన్నికలు జరగబోతున్నాయని రాహుల్ పేర్కొన్నారు. తెలంగాణలో ఆదాయం వచ్చే శాఖలు అన్నీ కేసీఆర్ కుటుంబం చేతిలో ఉన్నాయని ఆయన విమర్శలు గుప్పించారు. ఎక్కువ దోపిడి ఏ శాఖలో జరుగుతుందో మీకు తెలుసని ప్రజలను ఉద్దేశించి ఆయన చెప్పారు. ఎక్కువ దోపిడీ ఇసుక, లిక్కర్, భూమిలో జరుగుతుందని.. ఇవన్నీ కేసీఆర్, ఆయన పరివారం చేతిలోనే ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు జరిగిన దోపిడీ చాలదు అన్నట్టు… ఇంకా దోపిడీ చేయాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్కొక్కటి కూలిపోతుందని పేర్కొన్న రాహుల్.. కేసీఆర్ అక్కడికి వెళ్లి సమీక్ష చేయాల్సి ఉందన్నారు.
నెలకు 10 రోజులు ఆఫీసుకు రండి.. ఉద్యోగుల్ని కోరిన ఇన్ఫోసిస్..
కరోనా మహమ్మారి ముగిసిపోవడంతో దాదాపుగా అన్ని ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి స్వస్తి పలుకుతున్నాయి. తమ ఉద్యోగుల్ని ఆఫీసులకు రావాల్సిందే అని హెచ్చరిస్తున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు తమ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేశాయి. ఆఫీసులకు రాకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఉద్యోగులను హెచ్చరిస్తున్నాయి పలు ఐటీ సంస్థలు. ఇదిలా ఉంటే కొన్ని సంస్థలు వారానికి మూడు రోజులైన ఆఫీసులకు రావాలని కోరుతున్నాయి. హైబ్రీడ్ విధానంలో పనిచేయాలని సూచిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో భారతదేశంలో రెండో అతిపెద్ద సాఫ్ట్‌వేర్ ఎగుమతిదారుగా ఉన్న ఇన్ఫోసిస్ లిమిటెడ్ తన ఉద్యోగుల్లో కొంతమందిని నెలకు 10 రోజులు ఆఫీసు నుంచి పనిచేయాలని కోరినట్లు సమాచారం. హైయ్యర్ ఎఫీషియెన్సీ, ఉద్యోగుల మెరుగైన సహకారం కోసం ప్రపంచవ్యాప్తంగా అన్ని కంపెనీలు ‘రిమోట్ వర్క్’ విధానాన్ని తీసేస్తున్నాయి. తాజాగా ఇన్ఫోసిస్ కంపెనీ నవంబర్ 20 నుంచి ఈ విధానాన్ని అమలులోకి తెచ్చేందుకు ఎంట్రీ, మిడ్ లెవల్ సిబ్బందికి ఈమెయిల్స్ పంపినట్లు తెలిసింది.
ఉస్తాద్.. ఈసారి గట్టిగా ఇవ్వాలి.. గుర్తుపెట్టుకో
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రస్తుతం ఒక మాస్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు.గతేడాది నుంచి రామ్ ఒక భారీ విజయం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఆ హిట్.. స్కంద సినిమాతో వస్తుందేమో అనుకున్నాడు. కానీ, అది ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. బోయపాటి శ్రీను- రామ్ కాంబో అంటే.. అఖండ కన్నా మాస్ హిట్ అందుకుంటుందేమో అనుకున్నారు. కానీ, ఆ ఆశలు అడియాశలు అయ్యాయి. ఇక ప్రస్తుతం రామ్ అభిమానులందరూ.. డబుల్ ఇస్మార్ట్ మీదనే ఆశలు పెట్టుకున్నారు. రామ్ ను ఊర మాస్ ఉస్తాద్ గా మార్చింది ఇస్మార్ట్ శంకర్. పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎంతటి భారీ విజయం అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన వసరం లేదు. లైగర్ లాంటి డిజాస్టర్ తరువాత పూరి.. డబుల్ ఇస్మార్ట్ ను టేకోవర్ చేశాడు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటివరకు స్కంద మోడ్ లో ఉన్న రామ్.. ఇప్పుడు ఉస్తాద్ మోడ్ లోకి మారిపోయాడు.
పదికాలాల పాటు చంద్రబాబు చల్లగా ఉండాలి..
గతంలో ఎన్నికైన నాలుగేండ్ల తర్వాత పార్టీలు బయట అడుగు బయటపెట్టాలంటే భయపడేవారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.జగన్ మన గౌరవం, ఇమేజ్ పెంచారని, ప్రతి లబ్దిదారునికి మేలు జరిగిందని మంత్రి పేర్కొన్నారు. నేడు రాష్ట్రంలో పెద్ద కుట్ర, కుతంత్రం జరుగుతోందని ఆయన అన్నారు. పేదవాడు ఆర్థికంగా ముందుకు వెళ్తుంటే తట్టుకోలేకపోతున్నారని.. పేదోడికి న్యాయం జరగకుండా ఉండేందుకు చర్యలు జరుగుతున్నాయని మంత్రి మండిపడ్డారు. దోపిడి రాజ్యం రావాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయన్నారు.
వ్యవస్థలను మేనేజ్ చెయటంలో పెద్ద దిట్ట అని.. నేడు మనల్ని విమర్శిస్తున్నారని తీవ్రంగా వ్యాఖ్యానించారు. గతంలో దొంగతనం, దోపిడి చేసి దోచుకున్నారని.. వ్యవస్థలలో లొసుగులతో, చట్టాలలో లోపాలతో తప్పుకున్నారని ఆయన ఆరోపించారు. నేడు జగన్ ప్రభుత్వం చేసిన తప్పును, దోపిడినీ పకడ్బందీగా న్యాయస్థానం ముందు పెట్టిందన్నారు. ఒంట్లో, కంట్లో బాలేదు , చర్మ వ్యాధి వచ్చిందని కోర్టులో చెప్పారని.. పదికాలాల పాటు చంద్రబాబు చల్లగా ఉండాలనే తాము కోరుతున్నామన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన వ్యాఖ్యానించారు. టీడీపీ వారు ఏం పీకుతారు అన్నారని , అవినీతి అన్యాయం చేసి కబుర్లు మాటాడితే ఎం జరిగిందో చూసారు కదా అంటూ మంత్రి వ్యాఖ్యానించారు. సామాన్యులు, పేదవారి గురించి, రైతు గురించి చంద్రబాబు ఏనాడు ఆలోచించరని ఆయన అన్నారు. చంద్రబాబు డబ్బులు ఇస్తే ఓటేస్తారనుకోవడం పొరపాటు , ప్రజలు చాలా తెలివైనవారని మంత్రి పేర్కొన్నారు.
తెలంగాణ ప్రజలు కన్నటువంటి కలలు కన్నీళ్లు పాలయ్యాయి
నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో బుధవారం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ విజయభేరి కార్నర్ మీటింగ్, జడ్చర్లలో నిర్వహించిన రోడ్ షో మీటింగ్ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సభలో టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు బీఆర్ఎస్ పాలనలో నీళ్లు రాలేదని మండిపడ్డారు. ఉద్యోగాలు రాలేదని, నిధులు ఆగమైనాయని, పేదలకు ఇల్లు రాలేదని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలు కన్నటువంటి కలలు కన్నీళ్లు పాలయ్యాయని, మన కలలు నిజం కావాలంటే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలతోనే సాధ్యమన్నారు భట్టి విక్రమార్క.
“తాలిబాన్‌లకు బజరంగ్‌బలి” పరిష్కారం.. యోగీ సంచలన వ్యాఖ్యలు..
రాజస్థాన్‌లో ఎన్నికల ప్రచారంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. అల్వార్ లో బీజేపీ తరుపున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ఇజ్రాయిల్-గాజా యుద్ధాన్ని బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‌గా పోలుస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. గాజాలో తాలిబాన్ ఆలోచనలను ఎలా అణిచివేయబడుతుందో మీరు చూస్తున్నారా..? ఖచ్చితత్వంతో లక్ష్యాలను చేధిస్తున్నారని ఇజ్రాయిల్ ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. తాలిబాన్లకు బజరంగ్‌బలి విధానమే పరిష్కారమని ఆయన అన్నారు.
రాజస్థాన్ కాంగ్రెస్‌ని విమర్శిస్తూ.. అరాచకం, గుండాయిజం, ఉగ్రవాదం సమాజానికి శాపమని, రాజకీయాలు వాటిలో చిక్కుకున్నప్పుడు నాగరిక సమాజాన్ని ప్రభావితం చేస్తాయని యోగి అన్నారు. సర్దార్ పటేల్ కాశ్మీర్‌ని భారతదేశంలో అంతర్భాగంగా మార్చారు.. కానీ కాంగ్రెస్ నాయకుడు జవహర్ లాల్ నెహ్రూ సమస్య సృష్టించారని దుయ్యబట్టారు. దీని కారణంగానే ఉగ్రవాదం వ్యాపించిందని, బీజేపీ ప్రభుత్వం వచ్చార ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా కాశ్మీర్ లో ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు, సమస్యల్ని తీర్చేందుకు చర్యలు తీసుకున్నారని ఆయన అన్నారు.
ఎంపీతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యే
మార్కాపురం నియోజకవర్గంలోని కొనకనమిట్ల మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డితో కలిసి ప్రారంభించారు. కొనకనమిట్ల నూతన సచివాలయ భవనం, మండలంలో నూతనంగా నాగంపల్లి నుంచి కొనకన మిట్ల గ్రామం వరకు నిర్మించిన బీటీ రోడ్డు, తువ్వపాడు గ్రామంలో నూతన సచివాలయం భవనం, గార్లదిన్నే గ్రామంలో నూతన సచివాలయ భవనం, రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించారు.
దొంగోడిని విడుదల చేస్తే ఆశ్చర్యకరంగా కేరింతలేంటి..?
దొంగోడిని విడుదల చేస్తే ఆశ్చర్యకరంగా కేరింతలేంటి..? అంటూ స్పీకర్ తమ్మినేని సీతారాం టీడీపీ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. భువనేశ్వరి నిజమే గెలవాలంటుందని, మేము అదే అంటున్నాం నిజమే గెలవాలని అని ఆయన స్పష్టం చేశారు. నిజమే గెలవాలి, నిజమే గెలుస్తుందన్నారు తమ్మినేని సీతారాం. మీరన్నట్లు నిజమే గెలవాలనుకుంటే ఈ జన్మకి జైలు నుంచి మళ్లీరాడని ఆయన భువనేశ్వరిని ఉద్దేశించి అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన 99 శాతం ఇచ్చిన హామీలు నెరవేర్చామన్నారు. అసత్యాలు, అబద్ధాలు మాట్లాడుతున్న ప్రతిపక్షాలు జనంలో తిరుగుతున్నాయన్నారు. మనం చేసిన పని చెప్పుకుంటే చాలు విజయం మనదేనని వైసీపీ నేతలను ఉద్దేశించి మాట్లాడారు. నేడు గడప గడపలో సంతృప్తి వ్యక్తం అవుతుందని ఆయన అన్నారు. అవినీతి లేని ప్రభుత్వం అందిండంతో ప్రజలు అనందం వ్యక్తం చేస్తున్నారన్నారు.
విష్ణుకు ప్రమాదం.. హెల్త్ అప్డేట్ ఇచ్చిన మోహన్ బాబు
మంచు విష్ణు ప్రస్తుతం హీరోగా నిలబడడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. మంచు కుటుంబం మీద వస్తున్న ట్రోల్స్ వలన.. ఆ కుటుంబం నుంచి వస్తున్న సినిమాలపై ప్రేక్షకులు ఎవరు ఆసక్తి చూపించడం లేదు. అందుకు నిదర్శనం జిన్నా. మంచు విష్ణు, పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా.. మరి అంత ట్రోల్ కంటెంట్ ఏం కాదు. కథలో చిన్న చిన్న లోపాలు ఉన్నా కూడా చాలా సినిమాలతో పోలిస్తే బెటర్ గానే ఉంది. కానీ, మంచు కుటుంబంపై ఉన్న ట్రోలింగ్ వలనే ఈ సినిమా మంచిగా ఆడలేకపోయింది అనేది కొంతమంది అభిప్రాయం. అయితే ఈ ట్రోలింగ్ కంటెంట్ ను పక్కన పెట్టి.. ఎలాగైనా హీరోగా మరోసారి నిరూపించుకోవాలని విష్ణు ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే కన్నప్ప అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. మహాభారతం సీరియల్ తీసిన ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో స్టార్ క్యాస్టింగ్ ను తీసుకొని ఆశ్చర్యపరిచాడు విష్ణు. ప్రభాస్, మోహన్ లాల్, శివన్న, అనుష్క లాంటి స్టార్లందరూ ఈ చిత్రంలో నటిస్తున్నారు.
రేపు మంథని నియోజకవర్గంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ పర్యటన
రేపు మంథని నియోజకవర్గంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. హెలికాప్టర్‌లో రాహుల్ గాంధీ అంబట్‌పల్లికి చేరుకోనున్నారు. అంబట్‌పల్లిలో ఉదయం 7.30 గంటలకు నూతన గ్రామపంచాయతీ సమీపంలో మహిళా సదస్సులో రాహుల్ పాల్గొననున్నారు. సుమారు 5 వేల మంది మహిళలతో ఈ సభ జరగనుంది. ఆరు గ్యారంటీ పథకాలపై మహిళలకు రాహుల్ వివరించనున్నారు. సభ అనంతరం కుంగిన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్‌ను పరిశీలించనున్నట్లు సమాచారం. బ్యారేజ్ వద్ద 144 సెక్షన్ కొనసాగుతోంది.
రేపు నిర్మల్‌లో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ
నిర్మల్ నియోజకవర్గంలో భారత రాష్ట్ర సమితి ప్రచార జోరును మరింత పెంచనుంది. ఇప్పటికే ప్రచార పర్వంలో ముందున్న బీఆర్ఎస్, పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్తేజం నింపడమే లక్ష్యంగా ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు నవంబర్ 2న నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని, ప్రసంగించనున్నారు. ఎన్నికల ప్రచార బహిరంగ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు దిగ్విజయం చేయాలన్న సంకల్పంతో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. సమీకృత కలెక్టర్ కార్యాలయ సముదాయ సమీపంలోని గ్రౌండ్ లో భారీ ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
ఎన్నికల ముందే ప్రతిపక్ష నేతల అరెస్టుకు బీజేపీ కుట్ర..
బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బుధవారం బీజేపీపై విరుచుకుపడ్డారు. వచ్చే నెలలో రాష్ట్రాల ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికల ముందు ప్రతిపక్ష పార్టీల నేతలను అరెస్ట్ చేయడానికి బీజేపీ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ఇందుకు ఆప్ నేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నుంచే అరెస్టులు ప్రారంభించారని ఆమె ఆరోపించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల ముందు ప్రతిపక్షా పార్టీలను అదుపు చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని, ప్రతిపక్ష నాయకులందరిన అరెస్ట్ చేయాలని ప్లాన్ చేస్తు్న్నారని, తద్వారా దేశంలో ఖాళీ ఏర్పడితే తమకు అనుకూలంగా ఓటు వేయించుకోవచ్చని బీజేపీ కుట్ర చేస్తుందని ఆరోపించారు. ఉపాధి హమీ పథకం కింద కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు నవంబర్ 16 లోగా విడుదల చేయకుంటే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని అన్నారు. నవంబర్ 1 వరకే డెడ్ లైన్ విధించినప్పటికీ.. గవర్నర్ హమీ మేరకు కొన్ని రోజులు వేచి చూస్తామని మమతా తెలిపారు.