జగన్ పేరు చెప్తేనే ఓ శక్తి వస్తుంది అని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ అన్నారు. సమాజంలో అణగారిన వర్గాలకు రాజ్యాధికారం ఇచ్చిన సీఎం జగన్.. చంద్రబాబు అంటే అబద్దం...చంద్రబాబు అంటే మోసం.. అబద్ధాలకు, మోసాలకు చెక్ పెట్టిన నాయకుడు జగన్.
హైదరాబాద్ లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. దాదాపు రెండున్నర గంటల పాటు ఈ సమావేశం జరిగింది. ఉమ్మడి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలనే అభిప్రాయానికి టీడీపీ-జనసేన పార్టీలు వచ్చాయి.
మళ్లీ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు.. నాలుగు నెలలో ఎన్నికలు రాబోతున్నాయి.. ధన వంతులు - పేదావాడికీ.. దొపిడీకీ - నిజాయితీ మధ్య వార్ జరుగుతోంది.. ప్రజలు చాలా గ్రహించాలి.. మళ్లీ టీడీపీ దోపిడీ పార్టీ ని రాకుండా చూడాలి అని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పుకొచ్చారు.
సామాజిక సాధికార బస్సు యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది అని మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు. సామాజిక యాత్రకు ఎన్నికలతో సంబంధం లేదు.. సామాజిక విప్లవానికి ప్రతీక ఈ యాత్ర అని ఆయన పేర్కొన్నారు.
వెనుక బడిన వర్గాలకు నాలుగు రాజ్యసభ సీట్లు ఇచ్చిన ఘనత సీఎం జగన్ దే అని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఏపీలో సుపరిపాలన జరగకుండా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
చంద్రబాబు- పవన్ మధ్య భేటీ కొనసాగుతుంది. తెలంగాణ ఎన్నికలు సహా ఏపీలోని తాజా రాజకీయాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. త్వరలో టీడీపీ-జనసేన పార్టీల ఉమ్మడి విస్తృత స్థాయీ సమావేశాల నిర్వహాణపై ప్రస్తావనకు వచ్చే ఛాన్స్.. సీఐడీ పెడుతోన్న వరుస కేసుల పైనా కూడా ఇరువురు చర్చించే అవకాశం.
పల్నాడు జిల్లాలో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా బాపట్ల వైసీపీ ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ.. స్కిల్ డెవలప్మెంట్ కేసులో 350 కి పైగా కోట్ల రూపాయలు దోచేశారు అని ఆయన ఆరోపించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కి భయం పరిచయం చేసిన వ్యక్తి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. నాకు రోగాలు ఉన్నాయి బెయిల్ ఇవ్వండి అని వేడుకుని చంద్రబాబు బయటకు వచ్చాడు.
ఎన్నికల సమయంలో చంద్రబాబుపై రాజకీయ కక్ష సాధింపు ఎందుకు చేస్తామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. చేసే వాళ్ళం అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే చేసి ఉండే వాళ్ళం.. తీగ లాగితే డొంక కదిలినట్లు ఇప్పుడు అన్ని ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి..
చంద్రబాబుకు అదనపు షరతులు విధించాలంటూ మరోసారి హైకోర్టును ఆశ్రయించింది ఏపీ సీఐడీ.. అయితే, సీఐడీకి హైకోర్టు షాకిచ్చింది.. చంద్రబాబుకు అదనపు షరతులు విధించాలంటూ సీఐడీ వేసిన పిటిషన్ ను హైకోర్టు డిస్పోజ్ చేసింది.