చంద్రబాబు బయట ఉంటే ఎన్నికల్లో ఎదుర్కొనే దమ్ము జగనుకు లేదు అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబును జైల్లో పెట్టి ఎన్నికలు వెళ్లాలని జగన్ భావిస్తున్నారు.. సీబీఐ, ఈడీలు తన అక్రమాలను విచారణ చేయడానికి ముందే అవే అంశాల్లో చంద్రబాబును బద్నాం చేద్దామని జగన్ కుట్ర పన్నారు.
నాలుగున్నరేళ్లలో ఇసుక బొక్కేసి రూ. 40 వేల కోట్లు దోచిన గజదొంగ ఎవరు జగన్ రెడ్డి? కదా అని ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. ఇసుకను మీరు దోచేసి ఉచితంగా ఇసుక ఇచ్చిన చంద్రబాబుపై అక్రమ కేసు సిగ్గనిపించటం లేదా?.
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడిపై మరో కేసు నమోదైంది. టీడీపీ హయాంలో ఇసుక అక్రమాలపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఏపీఎమ్డీసీ ఇచ్చిన ఫిర్యాదుతో ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ-1గా పీతల సుజాత, ఏ-2గా చంద్రబాబు, ఏ-3గా చింతమనేని ప్రభాకర్, ఏ-4గా దేవినేని ఉమాలు ఉన్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల కోసమే కేసీఆర్ వ్యాఖ్యలు.. ఏడు విలీన మండలాల ప్రజలు మళ్ళీ తెలంగాణకు వెళతారా అని ఎవరో అడిగితే మేం వెళ్ళమని స్పష్టం చేశారు అని ఆయన తెలిపారు.
దొంగోడిని విడుదల చేస్తే ఆశ్చర్యకరంగా కేరింతలేంటి..? అంటూ స్పీకర్ తమ్మినేని సీతారాం టీడీపీ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. భువనేశ్వరి నిజమే గెలవాలంటుందని, మేము అదే అంటున్నాం నిజమే గెలవాలని అని ఆయన స్పష్టం చేశారు.
గతంలో ఎన్నికైన నాలుగేండ్ల తర్వాత పార్టీలు బయట అడుగు బయటపెట్టాలంటే భయపడేవారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.జగన్ మన గౌరవం, ఇమేజ్ పెంచారని, ప్రతి లబ్దిదారునికి మేలు జరిగిందని మంత్రి పేర్కొన్నారు.