కృష్ణాజిల్లా గుడివాడలోని 15వ వార్డులో రూ. 3కోట్ల 28లక్షల నిధులతో నిర్మించిన వాటర్ ట్యాంక్‌ను ఎమ్మెల్యే కొడాలి నాని, కృష్ణా జిల్లా పరిషత్ ఛైర్మన్ ఉప్పాల హారికతో కలిసి ఎంపీ వల్లభనేని బాలశౌరి ప్రారంభించారు.
విశాఖ రావాలన్న సీఎం నిర్ణయాన్ని ఎవరూ ప్రశ్నించలేరని ఏపీ ఐటీ మంత్రి అమర్‌నాథ్ పేర్కొన్నారు. విజయవాడ నుంచి విశాఖకు వస్తుంటే ఎందుకు అభ్యంతరమో వ్యతిరేకిస్తున్న వాళ్ళు చెప్పాలన్నారు. సీఎం ఎక్కడ నుంచైనా ప్రజల కోసం పాలన సాగించవచ్చన్నారు.
నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో అన్నీ రంగాల్లో సాధికారత సాధించామని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. రాజకీయంగా అన్నీ వర్గాలను చెయ్యి పట్టుకుని నడిపించామని ఆయన వెల్లడించారు. గతంలో టీడీపీ హయాంలో ఎన్నికల సమయంలో మాత్రమే అణగారిన వర్గాలు గుర్తుకు వచ్చేవని మంత్రి పేర్కొన్నారు.
ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి పై కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాలని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూర్ సభ్యులు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ చౌదరి డిమాండ్ చేశారు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఎటువంటి సాక్షాదారులు లేకుండా కేసులు నమోదు చేసి చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం వైఎస్ జగన్ వ్యవస్థలను మేనేజ్ చేసి సీఐడీలను ప్రయోగించి ప్రతిపక్షాలపై దాడులు చేస్తున్నారు.. తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇక రాజకీయాల నుంచి వైదొలగాని ఏపీ దేవాదాయ శాఖామంత్రి కొట్టు సత్యనారాయణ సలహా ఇచ్చారు. అనేక రోగాలు ఉన్నట్టు అయన తన బెయిల్ పిటిషన్ లో పేర్కొన్నారు.
అంతర్జాతీయ దొంగల ముఠాలకి ఏమాత్రం తీసిపోని పార్టీ టీడీపీ అని ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. మోసం చేయడంలో కొత్త టెక్నిక్కులతో ఏం చేస్తున్నారో ఈ మధ్యే బయట పడింది అని అన్నారు.
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన విషం విదితమే.. అయితే, చంద్రబాబుకు బెయిల్ మంజూరుపై ఏపీ ప్రభుత్వ వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.. బెయిల్ ఉత్తర్వుల్లో పేర్కొన్న పలు అంశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి ప్రభుత్వ వర్గాలు.. స్కిల్ స్కాంకు సంబంధించిన డబ్బు టీడీపీ పార్టీ ఖాతాలోకి చేరినట్టుగా కచ్చితమైన ఆధారం లేనట్టుగా బెయిల్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇది తొందరపాటుగా భావిస్తున్నాం అంటున్నాయి.