ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ - జనసేన పార్టీల నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమావేశాలు నిర్వహించనున్నారు.. 14, 15, 16 తేదీల్లో ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలని సమన్వయ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.. నియోజకవర్గ స్థాయిలో ఉమ్మడిగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఈ సమావేశాల్లో చర్చిస్తారు.. ఇక, ఈ నెల 17వ తేదీ నుంచి చేపట్టే ఇంటింటి ప్రచారంపై సమీక్ష చేపట్టనున్నారు నేతలు.
టీడీపీ అధినేత, మజీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఇసుక పంపిణీలో అక్రమాలు జరిగాయని సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. దీంతో ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై నేడు ఏపీ హైకోర్టులో విచారణకు వచ్చే ఛాన్స్ ఉంది.