ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు టీటీడీ జేఈవో గౌతమి, ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు ఇవాళ సాయంత్రం సచివాలయానికి రానున్నారు. ఇవాళ సాయంత్రం 4.41 గంటలకు చాంబర్‌లో సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. నేడు సచివాలయం మొదటి బ్లాక్ చాంబర్‌లో సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించనున్నారు.