CM Chandrababu Naidu: ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల 11, 12 తేదీల్లో ఏలూరు, కడప జిల్లాల్లో పర్యటించనున్నారు. ప్రజలతో నేరుగా మమేకమవుతూ, పార్టీ కార్యకర్తలకు మార్గనిర్దేశం చేస్తూ, దేవదర్శన కార్యక్రమాల్లో పాల్గొనడానికి సీఎం పర్యటన షెడ్యూల్ను అధికారికంగా ప్రకటించారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 11 (శుక్రవారం) నాడు ఏలూరు జిల్లా పర్యటన చేయనున్నారు. ఇందులో 11వ తేదీ ఉదయం 10 గంటలకు సీఎం చంద్రబాబు ఆగిరిపల్లి మండలం వడ్లమాను వెళ్లేందుకు హెలికాప్టర్లో…
CM Chandrababu Naidu: ప్రజల ఫిర్యాదులు, వినతుల పరిష్కారంలో మరింత వేగంగా స్పందించాలన్నారు సీఎం చంద్రబాబు. ఎప్పటికప్పుడు దరఖాస్తుదారుకు గ్రీవెన్స్ స్థితిని తెలిపేలా సమాచారం అందించాలన్నారు సీఎం. ఇందుకు ఏఐ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పరిష్కరించగలిగే వినతులను నిర్ణీత కాలవ్యవధిలోగా పరిష్కరించాలని చెప్పారు. అలాగే పరిష్కరించలేని వినతుల విషయంలో ఫిర్యాదుదారుకు… ఎందుకు పరిష్కరించలేకపోతున్నామనే విషయాన్ని సవివరంగా తెలియజేయాలని సూచించారు. గ్రీవెన్స్ల పరిష్కారంపై సచివాలయంలో ప్రత్యేకంగా సమీక్షించారు…
Srinivasa Reddy: వైసీపీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తాజాగా అమరావతిలో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో ఆయన మాట్లాడుతూ.. జగన్ మోహన్ రెడ్డి ప్రజా ఆరోగ్య వ్యవస్థను గాడిలో పెట్టారని, గ్రామస్థాయికి ప్రభుత్వ వైద్యాన్ని తీసుకెళ్లిన ఘనత ఆయనదని పేర్కొన్నారు. విలేజ్ క్లినిక్ ల ద్వారా గ్రామస్థాయికి ప్రభుత్వ వైద్యం అందించారని.. మండలానికి రెండు పీహెచ్సిలు ఉండాలనే ఆలోచనతో 80 కొత్త పీహెచ్సీలు ఏర్పాటు చేసారని తెలిపారు. అలాగే రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలను పటిష్టం చేశారని,…
వైసీపీ మైనారిటీ విభాగం అధ్యక్షుడు ఖాదర్ భాష టీడీపీ, జనసేనలపై మండిపడ్డాడు. వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకించిన ఇచ్చిన వైసీపీ అధినేత జగన్ కు రెండు రాష్ట్రాల ముస్లిం సమాజం కృతజ్ఞతలు చెబుతోందని అన్నాడు. ఖాదర్ భాష మాట్లాడుతూ.. చంద్రబాబు సూచించిన మూడు సవరణల వల్ల ఒరిగేదేమీ లేదు.. ముస్లింలను నిలువునా మోసం చేసి వక్ఫ్ బిల్లుకు మద్దతు ఇచ్చింది టీడీపీ.. వైసీపీ లోక్ సభలో వ్యతిరేకంగా ఓటు వేసిందని.. రాజ్యసభ లో అనుకూలంగా ఓటు వేసిందని…
గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి ప్రభుత్వానికి దక్కింది. 2001లో చంద్రబాబు హయాంలో గచ్చిబౌలి స్టేడియం నిర్మాణం కోసం హెచ్సీయూకి చెందిన 2300 ఎకరాల నుంచి 40 ఎకరాలు తీసుకున్నారు. అలాగే, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు ఐఎంజీ భారత్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని హెచ్సీయూ భూమిలో నుంచి మరో 400 ఎకరాలు కేటాయించారు. ఈ 400 ఎకరాల కేటాయింపును నిరసిస్తూ విద్యార్థులు ఆందోళన చేశారు. ఈ నిరసనల నేపథ్యంలో గోపన్పల్లి పరిధిలో ప్రత్యామ్నాయంగా 400 ఎకరాలు కేటాయించారు.…
ఉగాది పండగ రోజున పేదలకు సాయంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. రూ.38 కోట్ల సీఎం సహాయ నిధి ఫైలుపై సంతకం చేశారు. దాంతో 3,456 మంది లబ్ధిదారులకు మేలు జరగనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.281 కోట్లు విడుదల చేసింది. వైద్యం చేయించుకుని ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న పేద కుటుంబాలను ఆదుకునేందుకు సీఎం సహాయ నిధి ఉపయోగపడుతుంది. Also Read: Hardik Pandya: హార్దిక్ పాండ్యాకు…
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రెండు రోజులపాటు కలెక్టర్ల సమావేశాలు జరిగాయి. నేడు రెండో రోజు కలెక్టర్ల సమావేం ముగిసింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. “అమరావతి తిరుపతి వైజాగ్ లో సాంస్కృతిక కార్యక్రమాలు కోసం ప్రత్యేక కల్చర్ సెంటర్ ఉండాలి.. కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలి.. సంస్కృతిని నిరంతరం ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలి.. సమస్యల పరిష్కారం కోసం మనం ఉన్నాము.. అంతే కాని అడిగినప్పుడు సమస్యలు చెప్పడం కాదు.. జిల్లాలో సమస్య వస్తే ప్లానింగ్…
సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఇవాళ రెండో రోజు కలెక్టర్ల సమావేశం జరగనుంది. జిల్లాలో ఉన్న ప్రధాన సమస్యలను కలెక్టర్లు వివరించనున్నారు. ప్రతి కలెక్టర్ కు 10 నిమిషాల సమయం కేటాయిస్తారు.. రెవెన్యూ సమస్యలు.. ల్యాండ్ సర్వే.. మద్యం షాపులు.. జిల్లాలో పథకాల అమలుపై చర్చ జరగనుంది. వాట్సప్ గవర్నెన్స్, పీ4, జిల్లాలో పేదలకు ఇళ్ళ స్థలాలు, సోలార్రూఫ్ టాఫ్ లపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. READ MORE: Kunal Kamra: మధ్యప్రదేశ్లో కునాల్ కమ్రా పోస్టర్లు…
CM Chandrababu Naidu: అకాల వర్షాలు, వడగండ్ల వానల ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లా యల్లనూరు మండలం నీర్జంపల్లిలో ఇద్దరు అరటి రైతులు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన సంచలనం రేపింది. ఈ విషయాన్ని గమనించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జిల్లా కలెక్టర్, వ్యవసాయ శాఖా మంత్రి అచ్చెన్నాయుడు ఇతర అధికారులతో ఈ ఘటనపై సమీక్ష నిర్వహించారు. Read Also: Robinhood Trailer: నితిన్ ‘రాబిన్…
ప్రముఖ సినీ నటుడు, మాజీ వైసీపీ నేత పోసాని కృష్ణమురళి ఎట్టకేలకు గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో గత నెలలో అరెస్ట్ అయ్యాడు పోసాని. నిన్న సీఐడీ కోర్టు బెయిలు మంజూరు చేసినప్పటికీ, షూరిటీ సమర్పణలో ఆలస్యం కారణంగా విడుదల ప్రక్రియ కొంత జాప్యం అయింది.