Bharat Ram: తప్పులు చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bharat Ram: పోలవరం ప్రాజెక్ట్ విషయంలో చంద్రబాబు గతంలో చేసిన తప్పిదాలు క్షమించరానివని మాజీ ఎంపీ, వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్ ఆరోపించారు. గతంలో చంద్రబాబు తప్పులు చేయుటం వల్లే డయాఫ్రమ్ వాల్ మళ్లీ నిర్మించాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ఇప్పుడు మళ్లీ ఎందుకు అదే తప్పులు పునరావృతం చేస్తున్నారని విమర్శించారు. రాజమండ్రిలో వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ సిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎంపీ భరత్ మాట్లాడారు. ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ కమిటీ, పోలవరానికి సంబంధించి అన్ని అథారిటీలు పోలవరం సమర్ధవంతంగా పూర్తయ్యే విధంగా కాంప్రమైజ్ కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సిపి డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు.
పోలవరం ప్రాజెక్ట్ దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి మానసిక పుత్రిక అని భరత్ స్పష్టం చేశారు. అంతకుముందు పరిపాలించిన చంద్రబాబు పోలవరం గురించి అసలు పట్టించుకోలేదని గుర్తుచేశారు. వైఎస్ ఈ ప్రాజెక్ట్ ను ప్రతిష్ట్మాకంగా తీసుకుని పనిచేశారని అన్నారు. తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కమిషన్ల కోసం నామినేటెడ్ పద్దతిలో కాంటాక్టులు ఇవ్వడం, వంటి తప్పిదాల వలన డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందన్నారు. రెండు వైపులా ప్రొటక్షన్ వాల్స్ కడితేనేగానీ మెయిన్ డ్యామ్ నిర్మాణం చేయకూడదనేది నిబంధన ఉన్నప్పటికీ చంద్రబాబు ఒక పక్క అప్ డ్రీమ్ కాపర్ డాం, మరోపక్క ఓ డ్రీమ్ కాపర్ డాం నిర్మాణం చేస్తూ, ఎర్త్ ఫిల్ రాక్ డాం ప్రారంభించేసారని, కేవలం కమిషన్ల కోసం కాంట్రాక్టులు ఇవ్వడమే దీనికి కారణమని విమర్శించారు. మళ్ళీ తప్పిదాలు చేస్తున్నారని భరత్ వాపోయారు.
Also Read
- Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
- Nara Lokesh: దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం.. దానికి మీ సహకారం కావాలి
- Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
- Bay of Bengal Cyclone Alert: బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్
Read Also: Astram App: ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారంగా ‘అస్త్రం’ యాప్ ప్రారంభించిన మంత్రి అనిత..!
ఒకసారి గతంలోకి వెళ్తే, చంద్రబాబు హయాంలో డయాఫ్రం వాల్ 2018 నాటికి పూర్తి చేశారని, అయితే వరదలు వచ్చేనాటికి ఆప్స్ స్ట్రీమ్ కాపర్ డ్యామ్, దిగువ కాఫర్ డాం పూర్తి కాలేకపోవడం వలన భారీ వరదలకు డయా ఫ్రమ్ వాల్ బ్రీచెస్ పడిందని భరత్ గుర్తుచేశారు. ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యాంలో స్కవర్స్ ఏర్పడ్డాయన్నారు. వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు కాఫర్ డ్యాములను పూర్తి చేశారని, స్పిల్ వే, స్పిల్ఛానల్ కంప్లీట్ చేసి హైడ్రాలిక్ గేట్లు కూడా ఏర్పాటు చేసి వైయస్ జగన్ పోలవరం ప్రాజెక్టు ఒక రూపు తీసుకొచ్చారని భరత్ వివరించారు. చంద్రబాబు 2024లో అధికారంలోకి వచ్చాక అంతర్జాతీయ నిపుణుల బృందం పోలవరాన్ని పరిశీలించిందని, అయినా తప్పులు ఎందుకు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
ఇదంతా చూస్తుంటే, కమిషన్లకు అలవాటు పడి సబ్ కాంట్రాక్ట్స్ చేసే బావర్స్ సంస్థకు మెయిన్ కాంట్రాక్టు ఇచ్చేశారా అని భరత్ ప్రశ్నించారు. గతంలో చేసిన తప్పిదం వలన కొట్టుకుపోయిన కొత్తగా డయాఫ్రమ్ వాల్ కడుతున్నారని, అయితే ఈ ప్రాజెక్ట్ ని ప్రశ్నర్ధకం చేసేవిధంగా మరో పెద్ద తప్పిదం జరుగుతోందని ఆరోపించారు. చంద్రబాబు చేసిన తప్పిదానివల్ల పాడైన డివాల్ ను పునరుద్ధరిస్తూ 900 కోట్లతో నూతన నిర్మాణం చేపట్టారని, అయితే 66వేల చదరపు మీటర్ల కాంక్రీట్ డీవాల్ కట్టే పనిలో భాగంగా ఏప్రిల్ నెలాఖరు నాటికి 15వేల చదరపు మీటర్లు పూర్తిచేయాల్సి ఉంటే, 12వేల చదరపు మీటర్ల పని మాత్రమే చేసారని ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ కమిటీ నలుగురు సభ్యులు గత మే నెలలో పరిశీలన చేసి, జూన్ 4న నివేదిక ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. పోనీ పని తక్కువ అయిందనుకుంటే, ఫిట్ నెస్ విషయంలో 100 మీటర్ల లోతులో 1500 మందంతో కట్టాల్సి ఉంటే, 900 మందంతో మాత్రమే కట్టారని ఆయన వాపోయారు. కమిటీ నివేదికలోని ఇది స్పష్టం చేసారని ఆయన వివరించారు. డిజైన్స్, డ్రాయింగ్స్ ప్రకారం డివాల్ ఒకటిన్నర మీటర్ మందం వెడల్పు ఉండాల్సి ఉండగా.. 900 మిల్లీమీటర్లు మాత్రమే ఎందుకుందో స్పష్టం చేయాలని భరత్ డిమాండ్ చేసారు. ఇక ఇప్పటివరకు 52 ప్యానెల్స్ మాత్రమే పూర్తి చేశారన్నారు.
Read Also: AP EAPCET 2025 Results: ఆంధ్రప్రదేశ్ ఈఏపీసెట్ 2025 ఫలితాలు విడుదల..!
ఇక కాంక్రీట్ వేసేటప్పుడు నాణ్యమైన కాంక్రీట్ టెంపరేచర్ 32 డిగ్రీస్ సెంటీగ్రేడ్ ఉండాల్సి ఉండగా.. 35 డిగ్రీస్ టెంపరేచర్ వద్ద కాంక్రీట్ ఎందుకు వేశారని భరత్ ప్రశ్నించారు. దీనివల్ల 9 ప్యానెల్స్ వద్ద ఎయిర్ బబుల్స్ వచ్చాయని, పోలవరం హెడ్ వర్క్స్ పునాది విషయంలో ఎందుకు చారిత్రిక తప్పిదాలు చేస్తున్నారని ఆయన నిలదీసారు. గతంలో చంద్రబాబు తప్పులు చేయుటం వల్లే డయాఫ్రమ్వాల్ మళ్లీ నిర్మించాల్సివస్తోందని తెలిసి కూడా ఇప్పుడు మళ్లీ ఎందుకు అదే తప్పులు పునరావృతం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. పోలవరంలో తప్పులు చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేసారు. 35 రోజుల పని దినాలు ఆలస్యంగా పోలవరంలో పని జరుగుతోందని, వరదలు ప్రారంభమైతే పనులు ఆగిపోయే పరిస్థితి ఉందని, అసలు గోల్డెన్ పీరియడ్ ను ఎందుకు వృధా చేసారని భరత్ ప్రశ్నించారు.
పోలవరం ప్రాజెక్ట్ ని ఏమి చేద్దామనుకుంటున్నారని భరత్ ప్రశ్నించారు. పదికాలాలపాటు ఉండాలని కడుతున్నారా లేదా అని ఆయన నిలదీశారు. కమిషన్లకు అలవాటు పడి సబ్ కాంట్రాక్ట్స్ చేసే బావర్స్ సంస్థకు మెయిన్ కాంట్రాక్టు ఇచ్చేశారా, పోలవరం ప్రాజెక్టులో మీరు చేసే కక్కుర్తి పనుల వల్ల ఏమైనా ఇబ్బందులు ఏర్పడితే గోదావరి జిల్లాలు మిగులుతాయా అని ఆయన వాపోయారు. కమిషన్లు వేరే విషయాల్లో దండుకుంటే దండుకోండి, కానీ.. జీవనాడి పోలవరం విషయంలో మాత్రం కక్కుర్తి పడొద్దని భరత్ హితవు పలికారు. అందుకే ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ కమిటీ, పోలవరానికి సంబంధించి అన్ని అథారిటీలు పోలవరం సమర్ధవంతంగా పూర్తయ్యే విధంగా రాజీ పడకుండా పోలవరం పూర్తిచేయాలని భరత్ డిమాండ్ చేసారు.
తాజావార్తలు
-
Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్ప్లే, Dolby Vision, 65W సౌండ్!
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
-
Nara Lokesh: దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం.. దానికి మీ సహకారం కావాలి
-
Vande Bharat: ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ బ్రిడ్జ్‌పై 100KM వేగంతో దూసుకెళ్లిన వందే భారత్.. సరికొత్త రికార్డు
-
Varalaxmi Sarathkumar: “నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా”
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!