ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాజిస్టిక్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. వస్తు రవాణా, ప్రయాణికుల రవాణా లాంటి మాధ్యమాలను మరింత అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. పోర్టులు, ఎయిర్ పోర్టులు, రహదారి మార్గాలు, రైల్వే.. ఇలా వేర్వేరు రంగాలను విస్తృతం చేయాలని సూచించారు. భారత్‌లో లాజిస్టిక్స్ వ్యయం రూ.24.01 లక్షల కోట్లు అని, జీడీపీలో లాజిస్టిక్స్ వాటా 7.97 శాతంగా ఉందని వివరించారు. రవాణా రంగంలో రహదారి ద్వారా జరిగే రవాణా 41…