YS Jagan: మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు మోంథా తుపాను (Montha Cyclone) కారణంగా నష్టపోయిన ప్రాంతాల్లో ఈ నెల 4వ తేదీ (మంగళవారం) నాడు పర్యటించనున్నారు. పంటలు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయిన అన్నదాతలకు సంఘీభావం తెలిపేందుకు, వారికి అండగా నిలబడేందుకు ఆయన ఈ పర్యటన చేపట్టనున్నారు. వైయస్ జగన్ పర్యటన కృష్ణా జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో కొనసాగుతుందని వైయస్సార్ సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని,…
పోలవరం ప్రాజెక్ట్ ఏపీ ప్రజలకు జీవనాడిలాంటిదని మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు అన్నారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తగిన సమయం ఉంటుందని, పార్టీని మరింత పటిష్టం చేయడానికి మంచి అవకాశం ఉంటుందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ పేర్కొ్న్నారు. ప్రతిక్షంగానూ, అధికారంలోనూ, మళ్లీ ఇప్పుడు ప్రతిపక్షంగానూ పార్టీ ఉందన్నారు. అన్ని జిల్లా పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నేతలతో వైఎస్ జగన్ సమావేశం అయ్యారు. 15 ఏళ్లలో పార్టీ ప్రస్థానం ముందుకు సాగిందన్నారు. కాకపోతే మనం ఆర్గనైజ్డ్‌గా యుద్ధంచేస్తున్నామా? లేదా? అన్నది చాలా ముఖ్యమని పేర్కొన్నారు. పార్టీ వ్యవస్థీకృతంగా ముందుకు సాగితేనే అది…
రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఉండే సంస్కృతి ఏపీకి తెచ్చారని తీవ్రంగా విమర్శించారు. రోజు రోజుకీ రాష్ట్రంలో ప్రేరేపిత హింస రెట్టింపు అవుతుందని ఆరోపించారు.
గత ప్రభుత్వంలో ఏపీ ఏవియేషన్ కార్పొరేషన్ అక్రమాలపై ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.. 2019-24 మధ్య కాలంలో ఏవియేషన్ కార్పొరేషన్ లావాదేవీలపై ఆరా తీస్తోంది.. అప్పటి ఏవియేషన్ కార్పొరేషన్ ఎండీ భరత్ రెడ్డి అక్రమాలపై త్వరలో విజిలెన్స్ విచారణకు ఆదేశించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది..
ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో అవినీతిపై చంద్రబాబు ప్రభుత్వం దృష్టి సారించింది. ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి అవినీతిపై దృష్టి సారించిన ఏపీ సర్కారు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అవినీతే పరమావధిగా జలవనరుల శాఖను వైసీపీ పాలకులు దుర్వినియోగం చేశారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు.
సీఎం జగన్ రోడ్ల అభివృద్ధి పై సమీక్ష చేశారు అని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. గత టీడీపీ హయాంలో పీఎంజిఎస్ వై ద్వారా 330 కిలోమీటర్లు మాత్రమే వేశారు. మేము 3,185 కిలోమీటర్లకు టెండర్లు పిలిచి 970 కిలోమీటర్లు పూర్తి చేశాము. ఏఐబీ ద్వారా 5,238 కిలోమీటర్లు టెండర్లు పిలిస్తే.. 1816 కిలోమీటర్లు రోడ్లు పూర్తి చేసాము. టీడీపీ హయాంలో పంచాయతీ రాజ్ శాఖ తరపున 1,130 కిలోమీటర్లు రోడ్లు వేశారు. అక్టోబర్ నాటికి టెండర్లు పిలిచి…