తెలుగుదేశం పార్టీలో కొత్తరక్తాన్ని నింపి వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేస్తామని చంద్రబాబు, నారా లోకేష్‌లు మహానాడు వేదికగా చెప్పుకొచ్చారు. ఏలూరు పార్లమెంటు నియోజకవర్గానికి ఆ మాటలు ఎంతవరకు వర్తిస్తాయనేది ప్రస్తుతం తమ్ముళ్ల ప్రశ్న. వచ్చే ఎన్నికల్లో ఏలూరు ఎంపీ టికెట్ ఎవరికి ఇస్తారు? మాజీ ఎంపీ మాగంటి బాబు విషయంలో పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అని చర్చ జరుగుతోంది. 2014 ఎన్నికల్లో అతికష్టం మీద టికెట్ సంపాదించి గెలిచారు మాగంటి బాబు. 2019 ఎన్నికల్లో…
టీడీపీ అధికార ప్రతినిధి, సినీనటి దివ్యవాణి రాజీనామా అంశంలో పార్టీలో ఆసక్తికర పరిణామాలు జరిగాయి. ఆమె మూడు నాలుగేళ్ల క్రితమే పసుపు కండువా కప్పుకొన్నా.. దివ్యవాణికి ఉన్న సినీ గ్లామరుతో పార్టీలో.. ప్రజల్లో ఇమేజ్ సంపాదించారు. ఆమెకు టీడీపీ ప్రాధాన్యం ఇచ్చింది. ఈ క్రమంలో వైసీపీపైనా.. మంత్రులపైనా ఘాటైన విమర్శలు చేశారు దివ్యవాణి. అయితే మహానాడులో దివ్యవాణికి మాట్లాడే అవకాశం దక్కలేదు. దీంతో ఆమె అలకబూనారు. కావాలనే తనను పక్కకు తప్పించే ప్రయత్నం చేస్తున్నారని కామెంట్స్ చేశారు.…
ఏపీ టీడీపీలో మహానాడు ఉత్సాహం కనిపిస్తోంది. ఒకే ఒక్క సభతో కేడర్ మనసు మారిపోయిందన్న ప్రచారం మొదలైంది. శ్రేణుల్లో దూకుడు చూశాక.. సభా వేదికపై పొత్తుల మాటే వినిపించలేదు. ఇప్పుడు టీడీపీ కేడర్ సైతం కొత్తరాగం అందుకోవడంతో రాజకీయ వర్గాల్లో చర్చగా మారిపోయింది. మహానాడుకు ముందు జనసేనతో వన్‌సైడ్ లవ్‌లో ఉంది టీడీపీ. జనసేనాని నేరుగా చెప్పకపోయినా.. టీడీపీకి సానుకూల సంకేతాలు ఇచ్చేలా ప్రకటనలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కొన్నిచోట్ల టీడీపీ, జనసేన అవగాహనతో పోటీ…
టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటన రొటీన్‌కు భిన్నంగా సాగింది. కర్నూలు సమావేశంలో పార్టీ కేడర్ స్పందన, రోడ్ షోలకు లభించిన ఆదరణకు ఫుల్ ఖుషీ అయ్యి కీలక ప్రకటన చేశారు. డోన్ అభ్యర్థిగా సుబ్బారెడ్డి పేరును ప్రకటించారు. బాబు నోటి వెంట ఈ ప్రకటన రాగానే పార్టీ శ్రేణులు నివ్వెర పోయాయి. ఎన్నికలకు రెండేళ్ల ముందే అభ్యర్థిని ప్రకటించిన ఉదంతాలు లేకపోవడంతో అది చర్చగా మారింది. దీని వెనక టీడీపీ వ్యూహం…
ఉమ్మడి కర్నూలు జిల్లాలో చంద్రబాబు పర్యటన భిన్నంగా జరిగింది. కేడర్ నుంచి వచ్చిన స్పందన చూశాక.. ఏదో ఒకటి నిర్ణయం తీసుకోవాలని అనుకున్నారో ఏమో.. డోన్ టీడీపీ అభ్యర్థిగా సుబ్బారెడ్డి పేరును ప్రకటించేశారు. ఈ స్టేట్‌మెంట్‌పై టీడీపీతోపాటు జనసేన కార్యకర్తలు కూడా ఆశ్చర్యపోయాయట. ఒక్క డోన్‌లోనే కాదు.. చంద్రబాబు తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం చర్చ మొదలైంది. వచ్చే ఎన్నికల్లో ఏపీలో అధికారంలోకి రావాలని చూస్తున్న చంద్రబాబు.. కొన్ని రోజులుగా పొత్తులపై పదే పదే మాట్లాడుతున్నారు. అందరూ…
తెలుగుదేశం పార్టీ 40 వసంతాలు పూర్తిచేసుకుని ఇవాళ 41వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కార్యకర్తలు, నేతలకు దిశానిర్దేశం చేశారు. తెలుగుదేశం కార్యకర్తలు, నేతలు, అభిమానులందరికీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 40 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ చేతుల మీదుగా తెలుగుదేశం ఆవిర్భావం.. ఒక రాజకీయ అనివార్యం.కొందరు వ్యక్తుల కోసమో.. కొందరి పదవుల కోసమో ఏర్పడిన పార్టీ…