ఆమెను పొమ్మన లేక పొగ పెడుతున్నారా? మూడేళ్లుగా మహిళా నేత విషయంలో జరుగుతోంది అదేనా? తాజాగా ఒక మీటింగ్‌కు వెళ్లారని షోకాజ్ నోటీసు ఇచ్చి.. సస్పెండ్ చేసినంత పని చేశారా? చివరి నిమిషంలో ఎందుకు వెనక్కి తగ్గారు? ఇంతకీ ఎవరా మహిళా నేత? ఏమా పార్టీ? లెట్స్ వాచ్..! శింగనమల. టీడీపీకి పెద్ద తలపోటుగా ఉన్న నియోజకవర్గాల్లో ప్రధానమైనది. మూడేళ్లుగా పార్టీలో విభేదాలు కొనసాగుతున్నాయి. ఎస్సీ రిజర్డ్వ్ నియోజకవర్గమైన శింగనమలలో టీడీపీ అధిష్ఠానం చేసిన కొన్ని తప్పిదాలతో…
నవరత్నాలే హామీలుగా అధికారంలోకి వచ్చిన జగన్.. ఆర్థిక కష్టాలు ఉన్నా.. తుచ తప్పకుండా స్కీముల అమలు చేస్తున్నారు. సంక్షేమాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. అభివృద్ధి సంగతేంటనే విమర్శలు వచ్చినా.. బిల్డింగులు కాదు.. మానవాభివృద్ధే అసలు అభివృద్ధి అనే నినాదం ఎత్తుకున్నారు జగన్. ఏపీ లోటు బడ్జెట్ కు, జగన్ ఇచ్చిన హామీలకు పొంతన లేదన్న అభిప్రాయాల మధ్య జగన్ పాలన మొదలైంది. గత ప్రభుత్వాలకు భిన్నంగా.. అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే మొత్తం మ్యానిఫెస్టోనూ అమలు చేశామని, చెప్పనివి…
రాష్ట్రపతి ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. పట్టుమని పది రోజుల సమయం కూడా లేదు. దేశంలోని ప్రధాన పార్టీలతోపాటు.. తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పక్షాలు దేశాధ్యక్షుడి ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలో నిర్ణయం తీసేసుకున్నాయి. కానీ.. ఇప్పటి వరకు టీడీపీ నిర్ణయం ఏంటన్నది బయటకు రాలేదు. పార్లమెంటులో.. అసెంబ్లీలో పెద్దగా ప్రభావం చూపని స్థితిలో టీడీపీ సభ్యులు ఉన్నారు. జగన్‌కు జైకొట్టగా మిగిలిన 20 మంది ఎమ్మెల్యేలు.. ముగ్గురు లోక్‌సభ, ఒక రాజ్యసభ సభ్యుడు తెలుగుదేశానికి ఉన్నారు.…
గత ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవమో ఏమో.. అభ్యర్థుల విషయంలో గతానికి భిన్నంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు చంద్రబాబు. ఆయన రూటు మార్చేశారని భావిస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. మహానాడు తర్వాత చంద్రబాబు వైఖరిలో చాలా మార్పు వచ్చింది. ఆ మార్పు ఎలాంటిదో చంద్రబాబు నిర్వహిస్తున్న బాదుడే బాదుడు కార్యక్రమంలో గమనిస్తోంది పార్టీ కేడర్. ఎప్పుడూ లేనట్టుగా టీడీపీని వన్ వేలో తీసుకెళ్తున్నారని చర్చ జరుగుతోంది. తాజాగా ఉమ్మడి చిత్తూరు జిల్లా పర్యటనలో చంద్రబాబు ఎక్కడా చూద్దాం.. చేద్దాం అనే…
ఏపీలో పొలిటికల్ టార్గెట్స్ పర్సనల్ అయ్యాయి. ఎంత తిడితే అంత ఫాలోయింగ్ అన్నట్టుగా నేతలు తయారయ్యారు. పొలిటికల్ విమర్శలు సాధారణమే అయినా.. ఈ మధ్య అధికార ప్రతిపక్ష నేతలు వ్యక్తిగత విమర్శలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రధానంగా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌లను టార్గెట్ చేస్తున్నారు వైసీపీ మంత్రులు. గతంలో మంత్రులుగా పనిచేసిన వారితోపాటు ఇప్పుడు మంత్రులుగా ఉన్నవారు సైతం చంద్రబాబు, లోకేష్‌లపై ఒంటికాలిపై లేచిన సందర్భాలు అనేకం. ఘాటైన విమర్శలే గుప్పిస్తున్నారు. దీన్ని టీడీపీ…
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా.. పొత్తులు ఎత్తులు.. జిత్తులపై రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ, జనసేన రెండు కలిసి పోటీ చేస్తాయని అనుకుంటున్నారు. ఆ మధ్య కుప్పం పర్యటనలో చంద్రబాబు… జనసేనకు వన్‌సైడ్ లవ్ అని కన్నుగీటారు. ఆ తర్వాత జనసేన ఆవిర్భావ సభలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనని పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఈ మాటలు.. ప్రకటనలతో రెండు పార్టీలు దగ్గరవుతున్నట్టు భావించారు. కానీ.. ఇటీవల నిర్వహించిన మహానాడు తర్వాత టీడీపీ…
గుంటూరు జిల్లా మంగళగిరి. 2014 నుంచి మంగళగిరి రాష్ట్రంలో కీలక నియోజకవర్గంగా మారిపోయింది. సీఎం జగన్‌తోపాటు విపక్షనేత చంద్రబాబు కూడా ఇదే నియోజకవర్గంలో నివాసం ఉంటున్నారు. అందుకే మంగళగిరిపై పట్టుకోసం రెండు పార్టీలు వ్యూహాత్మకంగా మందుకెళ్తుంటాయి. 2019లో మంగళగిరి నుంచి నారా లోకేష్ పోటీ చెయ్యడంతో చాలా హైప్ వచ్చింది. ఆ ఎన్నికల్లో లోకేష్ ఓడిపోవడం.. ఆళ్ల రామకృష్ణారెడ్డి వరసగా గెలవడం పెద్ద చర్చకే దారితీసింది. వచ్చే ఎన్నికల్లో మరోసారి ఇక్కడి నుంచే పోటీ చేస్తానంటున్నారు లోకేష్.…
ఏపీలో వర్తమాన, భవిష్యత్ రాజకీయాలపై ఉండవల్లి అరుణ్‌కుమార్ సంధించిన వ్యంగ్యాస్త్రాలు ఇవి. మాజీ ఎంపీ సెటైరిక్‌గా చెప్పినా.. ఇది అక్షర సత్యం. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ కేంద్రంతో ఘర్షణ వైఖరి కోరుకోవడం లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని.. భవిష్యత్ రాజకీయ అవసరాల కోసం ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ సైతం బీజేపీని పల్లెత్తు మాట అనడం లేదు. ఇక జనసేన విషయం తెలిసిందే. బీజేపీతో పొత్తులో ఉన్నారు జనసేనాని. వీటిన్నింటినీ…