సింహాచలం అప్పన్న చందనోత్సవం కనుల పండువగా సాగుతోంది. చందనోత్సవానికి లక్షలాదిమంది భక్తులు తరలివస్తున్నారు. ఈ చందనోత్సవానికి హాజరయ్యారు విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర. లక్ష్మీనర్సింహ స్వామి నిజ రూపాన్ని దర్శించుకున్న స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర. ఏపీలో గొప్ప నారసింహక్షేత్రం సింహాచలం అన్నారు స్వరూపానందేంద్ర. సింహాద్రి అప్పన్నకు నిర్వహించే వేడుక చందనోత్సవం. వరాహ లక్ష్మీ నర్సింహ స్వామి దర్శనం సంతోషాన్నిచ్చిందన్నారు స్వరూపానందేంద్ర. తెలుగు రాష్ట్రాలు బాగుండాలని కోరుకున్నానన్నారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా చందనోత్సవానికి భక్తులను అనుమతించలేదన్నారు స్వరూపానందేంద్ర.…