Champion: శ్రీకాంత్ వారసుడు రోషన్ మేక హీరోగా, అనస్వరా రాజన్ హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ పీరియడ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘ఛాంపియన్’ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. క్రిస్మస్ కానుకగా విడుదలైన ఈ చిత్రం, ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించిన ఈ సినిమా, కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 11.5 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది అని సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది.…