Tech Layoffs: 2022.. మరికొద్ది రోజుల్లో ముగుస్తోంది. కానీ.. ఈ సంవత్సరం ఇప్పటికే లక్షన్నర మంది ఉద్యోగ జీవితాలు తాత్కాలికంగా ముగిశాయి. మీరిక రేపటి నుంచి ఆఫీసుకి రావొద్దంటూ 965 టెక్ కంపెనీలు తమ ఎంప్లాయీస్‌కి చెప్పేశాయి. 2008లో ప్రపంచ ఆర్థికమాంద్యం తలెత్తినప్పుడు కేవలం 65 వేల మందే కొలువులను కోల్పోగా 2009లో కూడా దాదాపు ఇదే సంఖ్యలో జాబులు పోయాయి. దీనికి రెట్టింపు కన్నా ఎక్కువగా ఈ ఏడాది లేఫ్‌లు ప్రకటించటం గమనించాల్సిన విషయం.