రూల్ అంటే రూలే.. అవి ఎవరు బ్రేక్ చేసినా వదిలేదు లేదు.. ట్రాఫిక్ నిబంధనలు ఎవరు పాటించకపోయినా ఫైన్ తప్పదని హెచ్చరిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు.. ఒకప్పుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించనివారిని అక్కడే ఆపి కౌన్సిలింగ్ ఇవ్వడం, చలానాలు రాయడం జరిగేది.. కానీ, ఇప్పుడు రూట్ మార్చేశారు ట్రాఫిక్ పోలీసులు.. కూడళ్ల దగ్గర ఓ పక్కన నిలబడి ట్రాఫిక్ రూల్స్ పాటించనివారిని ఫొటో తీసి చలానాలు వడ్డిస్తున్నారు. ఇక, ఉన్నతాధికారులకు అక్కడక్కడ మినహాయింపులు ఇచ్చేవారేమో.. కానీ, ఇప్పుడు కామారెడ్డి ట్రాఫిక్ పోలీసులు మాత్రం ఎవ్వరినీ వదలడం లేదు.. ఏకంగా కలెక్టర్ వాహనంపై కూడా చలానాలు రాశారు.. కామారెడ్డి కలెక్టర్ వాహనంపై ఏకంగా 28 ఈ చలానాలను ఉన్నాయంటే.. ఆ కలెక్టర్‌గారి స్పీడ్‌ను అర్థం చేసుకోవచ్చు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే… కామారెడ్డి కలెక్టర్ టీఎస్ 16 ఈఈ 3366 నంబర్ గల వాహనాన్ని వాడుతున్నారు.. 2016 సంవత్సరం నుంచి 2021 ఆగస్టు 20వ తేదీ వరకు ఆ వాహనంపై ఏకంగా 28 చలానాలు ఉన్నాయి. ఆ 28 ఈ చలానాలపై రూ.27,580 జరిమానాగా విధించారు.. ఇక, ఇందులో ఓవర్ స్పీడ్‌వే ఎక్కువ.. ఇప్పటి వరకు 28 చలానాలు పడితే.. అందులో అధికంగా 24 ఓవర్ స్పీడ్‌కు సంబంధించినవే కావడంతో.. ఆ కలెక్టర్‌గారి స్పీడ్ ఏ స్థాయిలో ఉందో చెప్పుకోవచ్చు. అయితే, ఏదైనా కాస్త వెరైటీ న్యూస్ దొరికితే.. వైరల్ చేసే నెటిజన్ల చేతికి ఇప్పుడు ఈ విషయం చిక్కింది.. దీంతో.. కలెక్టర్‌గారి కారును పోస్టు చేస్తూ.. కామెంట్లు పెడితూ వైరల్ చేస్తున్నారు.