అరవైయేళ్ల మహిళకు పాతికేళ్ల కుర్రాడు ఎలా భర్త అయ్యాడు? వాళ్లిద్దరూ ఎందుకు పెళ్లి చేసుకున్నారు? జీవితాంతం కలిసుండాలని ఎలా నిర్ణయించుకున్నారు? అనే కథాంశంతో రూపొందుతున్న స్వచ్ఛమైన వినోదాత్మక కుటుంబకథా చిత్రం ‘సావిత్రి వైఫ్ ఆఫ్ సత్యమూర్తి’. పాతికేళ్ల కుర్రాడిగా ‘కేరింత’ ఫేమ్ పార్వతీశం, అతని భార్య పాత్రలో అరవైయేళ్ల మహిళగా హాస్యనటి శ్రీలక్ష్మి వెండితెరపై సందడి చేయనున్నారు. గోగుల నరేంద్ర నిర్మిస్తున్న ఈ సినిమాతో పూరి జగన్నాథ్ శిష్యుడు చైతన్య కొండ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నిర్మాత గోగుల…