Chain Snatchers: సైబరాబాద్ కమీష్నరేట్ పరిధిలో వరస చైన్ స్నాచర్ లు హడల్ ఎత్తిస్తున్నారు. తెంపుడుగాళ్ళు రోజుకో ప్రదేశం మార్చి మహిళలకు వనుకు పుట్టిస్తున్నారు. వరుస చైన్ స్నాచింగ్ లతో పోలీసులకు సవాల్ గా మారింది. గంటల వ్యవధిలో చైన్ స్నాచింగ్ కేసులు నమోదు కావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. చైన్ స్నాచింగ్ కేసులు ఎక్కవగా నార్సింగ్ లోనే నమోదు కావడం స్థానికులు గల్లీలో రావాలంటేనే భయభ్రాంతులకు గురవుతున్నారు. ఉప్పల్, నాచారం, ఓయూ, రాంగోపాల్ పేట్ పరిధిలో స్నాచింగ్ హడలెత్తిస్తున్నాయి. గంటలోనే ఉప్పల్, నాచారం, ఓయూ, రాంగోపాల్ పేట్ లలో చైన్ స్నాచింగ్ జరగడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. నడుచుకుంటూ వెళ్తున్నవారిని టార్గెట్ చేస్తూ చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా చైన్ స్నాచింగ్ చేస్తూ కళ్లుమూసి తెరిచేలోగా దొంగతనాలకు పాల్పడుతున్నారు. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. హైదరాబాద్ రాచకొండ పరిధిలో ఆరు చోట్ల స్నాచింగ్ కేసులు నమోదు కావడంతో పోలీసులకు సవాల్ గా మారింది. ఉప్పల్, నాచారం, ఓయూ, రాంగోపాల్ పేట్ పరిధిలో స్నాచింగ్ కేసులు నమోదు కావడంతో.. స్నాచర్స్ ను పట్టుకోవడానికి పోలీస్ బృందాలు రంగంలో దిగారు. హైదరాబాదులోని అన్నిచోట్ల పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
కాగా.. హైదరాబాద్ లోని ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచర్ల దొంగల హల్చల్ సృష్టించారు. ఉప్పల్ మాస్టర్ చెఫ్ సమీపంలో మహిళ మెడలో నుండి బంగారు చైన్ అక్కెల్లిన దుండగులు పక్కనే మరొక దొంగతనానికి పాల్పడ్డారు. ఉప్పల్ కళ్యాణపురిలో ఉదయం వాకింగ్ కు వెళుతున్న సమయంలో మహిళ మెడలోని పుస్తెలతాడును దుండుగులు లాక్కొని వెళళ్లారు. బాధితురాలు ఉప్పల్ పోలీసులకు పిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫోటేజ్ ఆదారంతో దొంగలతను పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. గంటల వ్యవధిలో ఆరు చోట్ల దొంగతనాలు జరగడంతో నగరవాసులు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు చైన్ స్నాచర్ ను త్వరలో పట్టుకోవాలని మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని కోరుతున్నారు.
Read also: Kamareddy Master Plan: హైకోర్టుకు రైతులు.. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తాం
గతంలో సైబరాబాద్ పరిధిలోనే చైన్ స్నాచింగ్ కేసులు:
కాగా.. గత సంవత్సవరం అక్టోబర్ లో.. హైదరాబాద్ లోని నార్సింగిలో చైన్ స్నాచర్స్ హల్ చల్ సృష్టించారు. తిరుమల హిల్స్ లో నడుచుకుంటూ వెళుతున్న అరుణ అనే మహిళ మెడలో నుండి 4 తులాల బంగారు గొలుసు స్నాచింగ్. మోటర్ సైకిల్ పై వచ్చిన దుండగులు మహిళ మెడలో నుండి చైన్ స్నాచింగ్ చేసి పారిపోయారు. నార్సింగీ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు. బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చే క్రమంలో చైన్ స్నాచింగ్. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు నార్సింగీ పోలీసులు.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మొదట ఆగష్టు 13 శంషాబాద్ పోలీస్టేషన్ పరిధి లో ఉట్ పల్లి లో టైలరింగ్ షాపులోకి వచ్చిన స్నాచర్ లక్ష్మి అనే మహిల మెడలో నుంచి నాలుగు తులాల పుస్తెల తాండు ఎత్తుకెళ్ళాడు. రాజేంద్రనగర్ పోలీస్టేషన్ కు కూతవేటు దూరంలో బుద్వేల్ బస్టాఫ్ వద్ద బస్ కోసం వేచి ఉన్న సత్యవతి అనే మహిళ మెడలో నుంచి రెండు తులాల పుస్తెల తాడు తెంపుకుని పరారయ్యాడు. ఆర్జీఐఏ పోలీస్టేషన్ పరిధి అర్బీనగర్ లో పాల ప్యాకెట్ కోసం వెళ్తున్న గడ్డం అనిత అనే మహిళ మెడలో నుంచి 3.1/2 తులాల బంగారం పుస్తెల తాండు ఎత్తుకెళ్ళాడు.
నార్సింగ్ పోలీస్టేషన్ పరిధి తిరుమల హిల్స్ కాలనీలో నివాసం ఉంటున్న అరుణ అనే మహిళ బంధువుల ఇంటికి వెళ్ళి తిరిగి వస్తుండగా స్కూటిపై వచ్చిన తెంపుడుగాడు 3.1/2 తులాల పుస్తెల తాండు లాక్కోని వెళ్ళాడు శంషాబాద్ స్నాచర్ ను గుర్తించక ముందే రాజేంద్రనగర్, ఆర్జీఐఎ, నార్సింగ్ పోలీస్టేషన్ పరిధిలో స్నాచింగ్ లు జరగడం పోలీసులకు సవాల్ గా మారింది. వరుస చైన్ స్నాచింగ్ లు జరుగుతుండడంతో మహిళలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తిరగాల్సి వస్తుంది. వరుస చైన్ స్నాచింగ్ లతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రత్యేక పోలీసు టీంలను రంగంలోకి దింపి సీసీ కెమెరాల అధారంగా నింధితులను గుర్తించేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు నిందితుని ఫోటోను విడుదల చేశారు. నిందితుని ఎవరైన గుర్తిస్తే సమీపంలోని పోలీస్టేషన్ కు సమాచారం ఇవ్వాలని సూచించారు.