Chain Snatchers : చూపులన్నీ టార్గెట్ వైపే.. దొంగలను పట్టుకున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దొంగతనాలు చేసేందుకు అలవాటు పడిన వ్యక్తులు ఎంతకైనా తెగిస్తారు.. కొట్టేయాలని వన్స్ ఫిక్సైతే చాలు.. వారి చూపులన్నీ టార్గెట్ దగ్గర ఉన్న వస్తువు మీదు ఉంటుంది. ఈ క్రమంలో వస్తువు ఓనర్ ను సైతం కొన్నిసార్లు పట్టించుకోరు.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ దొంగ అచ్చం ఇట్లాగే చేశాడు. తాను దొంగతనం చేసేందుకు ఇంట్లో వ్యక్తినే టార్గెట్ చేసుకున్నాడు. చివరకు పోలీసులకు దొరికి కటకటాల పాలయ్యాడు.
Also Read : Man Chops Woman Body: మహిళను చంపి ముక్కలు ముక్కలుగా పాతేశాడు..
Also Read
- Jammu Kashmir: అఫ్జల్ గురు కుటుంబానికి షాక్.. బుల్డోజర్ యాక్షన్.!
- RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
- Central Cabinet Decision: SME వృద్ధి నిధికి రూ.10వేల కోట్లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
- BJP: 13 కోట్ల ఓటర్ల లెక్క ఇదే.. ఫేక్ ఓటర్లకు సపోర్ట్ ఎందుకు? కాంగ్రెస్‌కు బీజేపీ ప్రశ్నలు..
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం పల్లిమక్తకు చెందిన ఓ వృద్దురాలి మెడలో నుంచి హోలీ పండగ రోజు గుర్తు తెలియని వ్యక్తులు 3 తులాల పుస్తెల తాడు తెంపుకుపోయారు. మరుసటి రోజు ఆమె స్థానిక పీఎస్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. గ్రామంలోని ఇద్దరు వ్యక్తులపై ఆమె అనుమానం వ్యక్తం చేసింది. దీంతో ఆ దిశగానే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పలు కోణాల్లో విచారణ చేసిన పోలీసులు చోరీకి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదు.. దీంతో రూట్ మార్చారు. ఈ క్రమంలో మల్కపేట గ్రామానికి చెందిన వృద్దురాలి మనవడు ఎక్కలదేవి కరుణాకర్, అతడి స్నేహితుడుకి గతంలో దొంగతనాలు చేసిన చరిత్ర ఉందని తెలుసుకున్నారు. వారిపై అనుమానంతో సాంకేతికతను ఉపయోగించారు.
Also Read : Komatireddy Venkat Reddy: భట్టి పాదయాత్రకు మీరు రండి.. నేను వస్తా..!
దీంతో ఘటన జరిగిన ప్రదేశానికి దగ్గరలో ఉన్న సీసీ కెమెరాలను, సెల్ ఫోన్ లోకేషన్ ఆధారంగా వృద్దురాలి మనవడే.. తన స్నేహితుడితో కలిసి ఈ దొంగతనం చేశాడని పోలీసులు నిర్థారించుకున్నారు. నిందితులను పట్టుకుని బంగారం, ఓ బైక్, ఇద్దరి సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. విచారణలో భాగంగా నిందితులిద్దరు నేరాన్ని అంగీకరిండంతో రిమాండ్ కు తరలించినట్లు చందుర్తి సీఐ కిరణ్ తెలిపారు. ఈ కేసును పోలీసులు రెండు రోజుల్లో పరిష్కరించినందుకు సిబ్బందిని ఎస్పీ అఖిల్ మహాజన్ అభినందించారు. ఇంటి దొంగను పట్టించి.. తన సొమ్మును రికవరీ చేసి ఇచ్చిన పోలీసులకు వృద్దురాలు కృతజ్ఞతలు తెలిపింది.
తాజావార్తలు
-
Bhatti Vikramarka : కరెంట్ డిమాండ్‌లో బిగ్ రికార్డ్.. 20 వేల మెగావాట్లకు చేరిక.!
-
Jammu Kashmir: అఫ్జల్ గురు కుటుంబానికి షాక్.. బుల్డోజర్ యాక్షన్.!
-
RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
-
Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
-
Asaduddin Owaisi : ఓట్ల తొలగింపుపై ఒవైసీ ఫైర్.. సెక్రటేరియట్లో కీలక డిమాండ్లు
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!