యాపిల్ మొబైల్ ఫోన్లు వాడాలని అందరికీ ఉంటుంది. కానీ దాని ఖరీదు అధికంగా ఉంటుంది కాబట్టి యాండ్రాయిడ్ వెర్షన్ మొబైల్ ఫోన్లు వినియోగిస్తుంటారు. యాపిల్ సంస్థ మొబైల్ ఫోన్ల రంగంలోకి వచ్చే ముందు కంప్యూటర్లను రూపొందించింది. 1976లో స్టీవ్ జాబ్స్, స్టీవ్ వొజ్నియాక్‌లు యాపిల్ సంస్థను ఏర్పాటు చేసి తొలితరం కంప్యూటర్లు రూపొందించారు. తొలితరంలో మొత్తం 200 కంప్యూటర్లను తయారు చేశారు. అందులో ఒకదానిని కాలిఫోర్నియాలోని రాంచో కుకుమోంగాలోని ఛఫే కాలేజీలో పనిచేస్తున్న ఫ్రోఫెసర్ కొనుగోలు చేశారు.…