Hyderabad: హైదరాబాద్ మహానగరంలో తాజాగా కాల్పుల కలకలం చోటుచేసుకుంది. చాదర్‌ఘాట్ ప్రాంతంలో సెల్‌ఫోన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న ఓ దొంగను పట్టుకునే ప్రయత్నంలో ఈ ఘటన జరిగింది. ఈ సంఘటనలో సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్యపై దొంగ కత్తితో దాడికి యత్నించగా.. డీసీపీ స్వయంగా కాల్పులు జరిపారు. సెల్‌ఫోన్ స్నాచింగ్ చేస్తున్న దొంగను పట్టుకోవడానికి డీసీపీ చైతన్య ప్రయత్నించారు. ఈ సమయంలో ఆ దొంగ డీసీపీ చైతన్యపై కత్తితో దాడికి యత్నించాడు. ఈ తోపులాటలో డీసీపీ గన్‌మ్యాన్ కిందపడటంతో,…