ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా పోలింగ్ శాతం నమోదు అయిందని ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఈసీ లెక్కల ప్రకారం 78.36 శాతం మేర పోలింగ్ అయినట్లు పేర్కొన్నారు.
రాష్ట్రంలోని హింసాత్మక ఘటనలపై ఎన్నికల కమిషన్ ఆరా తీస్తోంది. కాసేపట్లో ఎన్నికల సంఘం ముందు మూడు జిల్లాల ఎస్పీలు హాజరు కానున్నారు. ప్రకాశం, నంద్యాల, పల్నాడు ఎస్పీలను తన వద్దకు వచ్చి వివరణ ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా ఆదేశించారు.
ఏపీలో ఎన్నికల నిర్వహణపై సీఈఓ ఎంకే మీనా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు, ఓటర్ల జాబితాపై సీఈఓ సమీక్ష చేపట్టారు. ఓటర్ల నమోదు, మార్పు చేర్పుల దరఖాస్తుల పరిష్కారంపై ఫోకస్ పెట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు.