యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ టామీ బ్యూమాంట్ డబుల్ సెంచరీ సాధించింది. మ్యాచ్‌లో మూడో రోజు టామీ ఈ ఘనత సాధించింది. టెస్ట్‌ల్లో ఆమెకు మొదటి డబుల్ సెంచరీ కాగా.. టెస్ట్‌ల్లో ఇంగ్లీష్ మహిళా బ్యాట్స్‌మెన్ సాధించిన మొదటి డబుల్ సెంచరీ.
Top 10 List of Fastest Centuries in ODI: వన్డే ప్రపంచకప్ 2023 క్వాలిఫయింగ్ మ్యాచ్‌లలో జింబాబ్వే ఆటగాళ్లు సెంచరీలతో చెలరేగుతున్నారు. ఈ క్రమంలోనే ఆల్‌రౌండర్ సికందర్ రజా వన్డే క్రికెట్‌లో జింబాబ్వే తరపున అత్యంత వేగంగా సెంచరీ చేసిన క్రికెటర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా మంగళవారం నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రజా 54 బంతుల్లో 102 పరుగులు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు సీన్ విలియమ్స్ పేరిట ఉంది. రెండు రోజుల…
మంగళవారం అమెరికా బ్యాట్స్‌మెన్ షాయన్ జహంగీర్ తన సత్తా చూపించాడు. ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ నేపాల్‌పై కేవలం 79 బంతుల్లో అజేయ సెంచరీ సాధించాడు. అయితే సెంచరీ చేసిన తర్వాత విరాట్ కోహ్లీకి సవాల్ విసిరాడు. మ్యాచ్ అనంతరం ఐసీసీతో జరిగిన ఇంటర్వ్యూలో జహంగీర్ మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీతో ఒక రోజు ఆడటం తన ఏకైక లక్ష్యమన్నారు.
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ఎస్ ఆర్ హెచ్ టీమ్ లో క్లాసెన్ ఒక్కడే అసాధరణమైన బ్యాటింగ్ తో ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. దీంతో రాయల్ ఛాలెంజర్స్ కు భారీ టార్గెట్ ను ఇచ్చింది.
ఇంగ్లండ్ కౌంటీ ఛాంపియన్ షిప్ డివిజన్-2లో ససెక్స్ జట్టుకు టీమిండియా వెటరన్ ఆటగాడు ఛెతేశ్వర్ పుజారా సారథ్యం వహిస్తున్నాడు. అయితే కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన తొలి మ్యాచ్ లోనే పుజారా సెంచరీతో అదరగొట్టాడు.
Shubman Gill: టీమిండియా యంగ్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ మరోసారి మెరిశాడు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరుగుతన్న మొదటి వన్డేలో సెంచరీతో సత్తాచాటాడు. వన్డేల్లో గిల్‌కు ఇది మూడో సెంచరీ కావడం గమనార్హం. ఇక ఈ క్రమంలోనే భారత జట్టు తరఫున అత్యధిక వేగంగా 1000 పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. వన్డే కెరీర్‌లో ఆడిన 19 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని చేరుకుని విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్ (24 ఇన్నింగ్స్‌లు) పేరుమీదున్న…
IND Vs SL: రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న కీలకమైన మూడో టీ20లో టీమిండియా స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ మరోసారి రెచ్చిపోయాడు. ఎడాపెడా సిక్సులు, ఫోర్లతో విధ్వంసం సృష్టించాడు. దీంతో అంతర్జాతీయ టీ20లలో మూడో సెంచరీ సాధించాడు. అంతేకాకుండా భారత్ తరఫున టీ20లలో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ పూర్తి చేశాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 45 బంతుల్లోనే సూర్యకుమార్ సెంచరీ మార్కు అందుకున్నాడు. దీంతో భారత్ భారీ స్కోరు సాధించింది. Read Also: BCCI: బీసీసీఐ సెలక్షన్…
David Warner: ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అరుదైన ఘనత సాధించాడు. మూడేళ్ల తర్వాత టెస్ట్ ఫార్మాట్‌లో సెంచరీ దాహాన్ని తీర్చుకున్నాడు. ఈ మేరకు అతడు వందో టెస్టులో సెంచరీ సాధించి సత్తా చాటుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో వార్నర్ శతకం బాదాడు. దీంతో టెస్టుల్లో 25వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అయితే వందో టెస్టులో సెంచరీ చేసిన వార్నర్.. గతంలో వందో వన్డేలోనూ సెంచరీ చేశాడు. దీంతో వందో టెస్టు, వందో…
Team India: టీమిండియా సీనియర్ క్రికెటర్ పుజారా చాన్నాళ్ల తర్వాత సెంచరీ చేశాడు. ఒక క్రికెటర్ జీవితంలో నాలుగేళ్ల కాలం చాలా విలువైంది. ఈ నాలుగేళ్ల కాలంలో ఏమైనా జరగొచ్చు. అయితే పుజారా మాత్రం ఎంతో సహనం ప్రదర్శించి నిలకడగా ఆడుతున్నాడు. ఒకానొక దశలో జట్టులో స్థానం కోల్పోయినా మనోనిబ్బరం కోల్పోకుండా కీలక ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. 2019 జనవరిలో సెంచరీ చేసిన పుజారా.. సుదీర్ఘ విరామం తర్వాత బంగ్లాదేశ్‌పై సెంచరీ బాది విమర్శకుల నోళ్లను మూయించాడు. 1,443…
Century in 100th ODI Match: ప్రతి ఆటగాడు ప్రతి మ్యాచులో సెంచరీ చేయాలని భావిస్తాడు. వందో మ్యాచులో సెంచరీ చేస్తే ఆ మజానే వేరు. అంతర్జాతీయ వన్డేలలో 100వ మ్యాచ్‌లో సెంచరీ చేసిన ఆటగాళ్లు చాలా మందే ఉన్నారు. ఆ ఆటగాళ్ల గురించి తెలుసుకోవాలంటే ఈ కింది వీడియో క్లిక్ చేయండి.