New parliament Building: ప్రస్తుత పార్లమెంట్ భవనం పాతది కావడంతో మోడీ నూతన భవనాన్ని నిర్మించ తలపెట్టారు. కొత్త భవనం నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఈ నెలాఖరులోగా పార్లమెంటు భవనాన్ని లాంఛనంగా ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
PM Modi will inaugurate Kartavya Path: ప్రధాని నరేంద్రమోదీ నేడు సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టనున్నారు. వలసపాలన గుర్తులను చెరిపివేస్తూ.. రాజ్ పథ్ పేరును ‘కర్తవ్యపథ్’గా మార్చారు. నేడు ప్రధాని మోదీ చేతుల మీదుగా కర్తవ్యపథ్ ప్రారంభం కాబోతోంది. గురువారం సాయంత్రం ప్రధాని మోదీ దీన్ని ప్రారంభించున్నారు. అక్కడే ఇండియా గేట్ సమీపంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు మోదీ.
సెంట్రల్ విస్టా పేరుతో కేంద్ర ప్రభుత్వం కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మిస్తోంది. ఈ కొత్త పార్లమెంటు నిర్మాణ పనులను టాటా ప్రాజెక్ట్స్ సంస్థ చేపట్టింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌కు కూతవేటు దూరంలో 13 ఎకరాల స్థలంలో పార్లమెంట్ భవనాల నిర్మాణం జరుగుతోంది. 2020 డిసెంబరులో ఈ భవనాల నిర్మాణానికి భూమి పూజ జరిగింది. ఆ సమయంలో ఈ ప్రాజెక్టు బడ్జెట్ రూ.977 కోట్లుగా ఉంది. అయితే ఏడాది గడిచే లోపే బడ్జెట్ భారీగా పెరిగింది. ఏకంగా 29…
అమెరికా పర్యటనను ముగించుకొని ఆదివారం సాయంత్రం ఇండియాకు తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. ఇండియాకు తిరిగి వచ్చిన వెంటనే ప్రధాని మోడీ ఎవరికీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సడెన్‌గా కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణం జరుగుతున్న ప్రాంతాన్ని సందర్శించారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సడెన్‌గా భవనం నిర్మాణం జరుగుతున్న ప్రాంతాన్ని ప్రధాని సందర్శించడంతో ఇంజనీర్లు షాకయ్యారు. దాదాపు గంటసేపు ప్రధాని మోడీ నిర్మాణం జరుగుతున్న ప్రాంతాన్ని సందర్శించారు. పనితీరును అడిగి తెలుసుకున్నారు. 2022 శీతాకాల సమావేశాలు కొత్త…
సెంట్రల్ విస్టా ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేసింది ఢిల్లీ హైకోర్టు.. సెంట్రల్ విస్టా ప్రాజెక్టు నిర్మాణ పనులను ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది.. ఇది చాలా ముఖ్యమైన జాతీయ ప్రాజెక్టు అని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో.. సెంట్రల్ విస్టా పనులను ఆపాలంటూ దాఖలైన పిల్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. ఇది ఉద్దేశపూర్వకంగా వేసిన పిటిషన్ తప్ప పిల్ కాదని పేర్కొంది.. అంతేకాదు పిటిషనర్లకు రూ.లక్షల జరిమానా కూడా విధించింది. సంబంధిత…
భారత దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా కేంద్రం సెంటర్ విస్టా భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. సెంటర్ విస్టా ప్రాజెక్టులో కొత్త పార్లమెంట్ భవనం, సెక్రటేరియట్, ఉప రాష్ట్రపతి, ప్రధాని కొత్త నివాసాలను నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు మొత్తం 2026 వరకు పూర్తి కానున్నది. కొత్త పార్లమెంట్ భవనం, సెంట్రల్ విస్టా అవెన్యూ కోసం కేంద్రం రూ. వెయ్యి కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించింది. 75 వ స్వాతంత్ర తరువాత జరిగే…