ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు బిజీబిజీగా గడుపుతున్నారు.. కాసేపటికే క్రితమే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో చంద్రబాబు సమావేశం ముగిసింది.. ఈ భేటీలో కీలక అంశాలపై చర్చించారు.. మాజీ కేంద్ర మంత్రి, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజును గవర్నర్ గా నియమించడంపై హోం మంత్రి అమిత్ షాకు, కేంద్రానికి, ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు.. రాష్ట్రానికి చెందిన పలు అంశాలపై అమిత్ షాతో చర్చించారు.
BJP action plan on 2024 elections: బీజేపీ కూడా 2024 సార్వత్రిక ఎన్నికలకు సమాయత్తం అవుతోంది. టార్గెట్ 2024పై ఢిల్లీలో బీజేపీ మేథోమధన సదస్సు జరుగుతోంది. 2024 సార్వత్రిక ఎన్నికల కోసం రోడ్‌మ్యాప్ సిద్ధం చేసే పనిలో ఉంది బీజేపీ. మంగళవారం ఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి నేతృత్వంలో కేంద్ర మంత్రులతో సమావేశం జరిగింది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, తెలంగాణ, మహారాష్ట్ర, పంజాబ్, యూపీలో బలపడేందుకు కసరత్తు…
కేంద్ర హోం మంత్రి అమిత్ షా వర్చువల్ సమక్షంలో శనివారం భారతదేశంలోని నాలుగు ప్రాంతాల్లో 30,000 కిలోల డ్రగ్స్‌ని కాల్చివేశారు. ఢిల్లీ, చెన్నై, గౌహతి, కోల్‌కతాలో పట్టుబడిన డ్రగ్స్‌ను చండీగఢ్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యవేక్షణలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కాల్చివేసింది.
గత పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో నాలుగు ఎంపీ సీట్లు గెలిచాం.. మూడు చోట్ల స్వల్ప తేడాతో ఓడిపోయాం.. కానీ, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని ఎంపీ సీట్లు బీజేపీయే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా… నిర్మల్‌లో బీజేపీ ఏర్పాటు చేసిన తెలంగాణ విమోచన దినోత్సవ సభకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు విమోచన శుభాకాంక్షలు తెలిపారు.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 13 నెలల తర్వాత…