Budget and Startups: 2022వ సంవత్సరంలో ఇండియన్ స్టార్టప్‌ల వ్యవస్థ కొంచెం గాడి తప్పింది. నిధులు నిండుకోవటంతో తిరోగమనంలో పయనించింది. ఈ ఫండింగ్ సమస్య వల్ల స్టార్టప్‌లకు ఆశాజనకమైన పరిస్థితులు కరువయ్యాయి. ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో పెట్టుబడిదారులు డబ్బు ఇచ్చేందుకు ముందుకురాలేని ప్రతికూల పరిణామాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో మరో 10 రోజుల్లో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న కేంద్ర ప్రభుత్వ బడ్జెట్-2023.. ఇండియన్ స్టార్టప్‌లకు ఎలాంటి భరోసా ఇస్తుందోనని సంబంధిత వర్గాలు ఎదురుచూస్తున్నాయి.