Hezbollah: హెజ్బుల్లాకు చెందిన మరో కీలక నేతను ఇజ్రాయెల్ సైన్యం మట్టుబెట్టింది. లెబనాన్ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో హెజ్బుల్లా మీడియా వ్యవహారాల బాధ్యతలు నిర్వహించే ప్రధాన ప్రతినిధి మహమ్మద్ అఫిఫ్ చనిపోయాడు.
Israel-Hezbollah: ఇజ్రాయెల్- లెబనాల్‌ల మధ్య యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్తత కొనసాగుతుంది. తాజాగా, లెబనాన్‌లోని బీరుట్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 22 మంది మృతి చెందగా.. మరో 117 మంది తీవ్రంగా గాయపడ్డారు అని లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.