Uzbekistan: మధ్య ఆసియాలో ముస్లింలు అధికంగా నివసించే దేశమైన ఉజ్బెకిస్థాన్ ప్రస్తుతం చరిత్రలో ఎన్నడూ లేనంత దారుణమైన కరువును ఎదుర్కొంటోంది. ఈ దేశంలో పరిస్థితి ఎంత దారుణంగా మారిందంటే, శుక్రవారం దేశవ్యాప్తంగా ఏకకాలంలో 2 వేల మసీదులలో వర్షం కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సైన్స్, వాతావరణం సహకరించనప్పుడు ప్రజలు అల్లాహ్ దయ కోసం ప్రార్థించాలని మత నాయకులు పిలుపునిచ్చారు. దీంతో దేశ రాజధాని తాష్కెంట్‌లో వేలాది మంది ప్రజలు ఏకకాలంలో బహిరంగ ప్రదేశాలు, మసీదులలో ప్రార్థనలు…