పార్లమెంట్‌లో (Parliament) ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టకముందు పీఎం కిసాన్‌పై (PM Kisan funds) అన్నదాతలకు శుభవార్త ఉంటుందని అనేక వార్తలు షికార్లు చేశాయి.
బుధవారం పార్లమెంట్ మధ్యంతర బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇక గురువారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. త్వరలో ఓట్ల జాతర జరగనున్న నేపథ్యంలో ఈ బడ్జెట్‌కు చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలాంటి తరుణంలో తాజాగా కేంద్రం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.