ఇండియా టూర్‌లో మెస్సీ ఆడలేదు. గోల్ చెయ్యలేదు. కాలు కదపలేదు. ప్రత్యర్థి జట్లను వణికించిన ఆ పాదాల మాయాజాలం భారత ప్రేక్షకులు వీక్షించనే లేదు. అతను ఆడకపోవడం వెనక చాల కథ వుంది. అది కొందరికి విచిత్రంగా, వింతగా కూడా అనిపించొచ్చు. ఇంతకీ అతను ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడకపోవడానికి కారణమేంటి? మెస్సీ అంటే ప్రపంచవ్యాప్తంగా పిచ్చి. భారత అభిమానులకు ఎనలేని అభిమానం. అతన్ని చూడాలనే కాదు…అతని ఆటను స్వయంగా చూసి తరించాలని వేల రూపాయల టికెట్ కొనుక్కుని…