ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను గోల్కొండ కోట సర్వంగా సుందరంగా ముస్తాబైంది. గోల్కొండ కోటలో స్వాతంత్య్ర వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ తెలిపారు. ఆగస్టు 15 రోజున ఉదయం 10.30 గంటలకు సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేస్తారని వెల్లడించారు. వజ్రోత్సవాల్లో భాగంగా ఈనెల 16న ఉదయం 11.30 గంటలకు నిర్వహించే సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని , ఆ సమయంలో ప్రతి రహదారిలో ట్రాఫిక్ నిలిపివేస్తామని తెలిపారు. కార్యాలయాలు, చారిత్రక ప్రదేశాలు, ఇతర చోట్లు సామూహిక జాతీయ గీతాలాపనకు ఏర్పట్లు చేశామన్నారు. వ్రజోత్సవాల్లో భాగంగా ఈనెల 13న ఊరూరా జాతీయ స్పూర్తి ర్యాలీలను నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పంచాయితీలు, మున్సిపాల్టీల్లో విద్యార్తులు, ఉద్యోగులు, ప్లకార్డులతో ర్యాలీలు చేపట్టనున్నారు.
read also: Montenegro: కుటుంబ కలహాలతో కాల్పులు.. పిల్లలతో సహా 12 మంది మృతి
ఇవాళ వజ్రోత్సవాలను టీఎస్‌ఆర్టీసీ ఆధ్వర్యంలో శనివారం గ్రాండ్ బస్ పరేడ్‌ను నిర్వహించనున్నట్టు సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. శనివారం సాయంత్రం 4 గంటలకు ట్యాంక్‌బండ్ సమీపంలోని రోటరీపార్క్ బస్ పరేడ్ నిర్వహిస్తామని పేర్కొన్నారు.
What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?