నేడు స్వాత్రంత్ర్య భారత వజ్రోత్సవాల్లో కీలక ఘట్టం. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా సామూహిక జాతీయగీతాలాపన కార్యక్రమం నిర్వహించనున్నారు. రాష్ట్రమంతా ఒకే సమయంలో జాతీయగీతం పాడేలా ఏర్పాట్లు. అబిడ్స్ పోస్టాఫీస్ దగ్గర సామూహిక జాతీయగీతాలాపనలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. ఉదయం 11.30 గంటలకు కార్యక్రమం కొనసాగనుంది. అన్ని ట్రాఫిక్ కూడళ్లో నిమిషం పాటు రెడ్ సిగ్నల్ వేసి ఈ సామూహిక జాతీయగీతాలాపన వుంటుందని పేర్కొన్నారు. సామూహిక జాతీయగీతాలాపన నేపథ్యంలో ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ తెలిపారు.
నగరంలోని లిబర్టీ, బషీర్‌బాగ్ నుంచి అబిడ్స్ వైపు వచ్చే వాహనాలను బీజేఆర్ సర్కిల్ వద్ద ఏఆర్ పెట్రోల్ పంప్, నాంపల్లి స్టేషన్ రోడ్డుకు మళ్లిలించనున్నారు. లిబర్టీ వైపు నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులను బీజేఆర్ సర్కిల్ వైపు అనుమతించే అవకాశంలేదు. లిబర్టీ వద్ద హిమాయత్‌నగర్, నారాయణగూడ, కాచిగూడ, కోఠి రూట్లలోకి మళ్లిస్తారు. కింగ్‌కోఠి నుంచి అబిడ్స్ వైపు వచ్చే వాహనాలను హనుమాన్ టేక్డి, ట్రూప్ బజార్, కోఠి వైపు మళ్లించనున్నారు. బొగ్గులకుంట నుంచి అబిడ్స్ వైపు వచ్చే వాహనాలను బొగ్గులకుంట క్రాస్ రోడ్డు వద్ద హనుమాన్ టేక్డి, ట్రూప్ బజార్, కోఠి వైపు మళ్లిస్తారు. ఎంజే మార్కెట్, జాంబాగ్ నుంచి అబిడ్స్ వైపు వచ్చే వాహనాలను ఎంజేమార్కెట్ నుంచి నాంపల్లి వైపు మళ్లించనున్నారు. పీసీఆర్ నుంచి బీజేఆర్ సర్కిల్ మీదుగా అబిడ్స్ వైపు వచ్చే వాహనాలను, ఏఆర్ పెట్రోల్ పంప్ నుంచి నాంపల్లి స్టేషన్ రోడ్డులోకి మళ్లిస్తారు.
సోమాజిగూడ, ఖైరతాబాద్, రవీంద్ర భారతి జంక్షన్, అసెంబ్లీ, ఎల్బీస్టేడియం, బీజేఆర్ విగ్రహం, లిబర్టీ, హిమాయత్‌నగర్, జీపీఓ అబిడ్స్, ఎంజేమార్కెట్, నాంపల్లి రోడ్లలో భారీగా ట్రాఫిక్ ఉండే అవకాశం ఉండటంతో వాహనదారులు ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలి. కాగా..జీపీఓ వద్ద జరిగే కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చే వారు తమ వాహనాలను నిజాం కాలేజీ గ్రౌండ్, తాజ్‌మహల్ నుంచి కింగ్ కోఠి ఎక్స్ రోడ్డు, బాటా నుంచి బొగ్గుల కుంట ఎక్స్ రోడ్డు, జీహెచ్‌ఎంసీ అఫీస్, రామకృష్ణ థియేటర్, జార్జ్ గ్రామర్ స్కూల్ ప్రాంగణాల్లో పార్కింగ్ చేయాలి. ఎంజే మార్కెట్, ఆఫ్జల్‌గంజ్ వైపు నుంచి వచ్చే వాహనాలను ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, అన్నపూర్ణ హోటల్ రోడ్డులో పార్కు చేయాలి.
Bihar Cabinet: నేడే బిహార్ మంత్రివర్గ విస్తరణ.. సింహభాగం ఆర్జేడీకే..!