తెలంగాణ సీఎం కేసీఆర్ మంగళవారం (నిన్న) ప్రగతి భవన్ లో కమిటీతో సమావేశ మయ్యారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల కార్యాచరణపై కమిటీతో చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆగస్టు 8 నుంచి 22 వరకు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని, అంటే రెండు వారాల పాటు వేడుకలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ కమిటీతో సీఎం సమావేశమవుతారు. మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తిని ప్రజలందరిలో మేల్కొలిపేలా వేడుకలు ఉండాలని సీఎం పేర్కొన్నారు. ప్రతి గుండెలో భారతీయత నిండేలా చూడాలని సీఎం అన్నారు. సమున్నతంగా, అంగరంగ వైభవంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాలు తెలంగాణ రాష్ట్రంలో జరపాలని ఆదేశించారు. హెచ్‌ఐసీసీలో ప్రారంభ సమారోహం, ఎల్బీ స్టేడియంలో ముగింపు కార్యక్రమం వుంటుందని, అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. 21న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం వుంటుందని సీఎం పేర్కొన్నారు.
వజ్రోత్సవాల షెడ్యూల్:
ఆగస్టు 08 : స్వతంత్ర భాతర వజ్రోత్సవ ద్విసప్తాహం’ ప్రారంభోత్సవ కార్యక్రమాలు
ఆగస్టు 09 : ఇంటింటికీ జాతీయ పతాకాల పంపిణీ ప్రారంభోత్సవం
ఆగస్టు 10 : వజ్రోత్సవ వన మహోత్సవంలో భాగంగా.. గ్రామ గ్రామాన మొక్కలు నాటడం., ఫ్రీడం పార్కుల ఏర్పాటు
ఆగస్టు 11 : ఫ్రీడం రన్ నిర్వహణ
ఆగస్టు 12 : రాఖీ దినోత్సవం సందర్భంగా వివిధ మీడియాల సంస్థల ద్వారా ప్రత్యేక వజ్రోత్సవ కార్యక్రమాల ప్రసారాలకు విజ్జప్తి
ఆగస్టు 13 : విద్యార్థులు, యువకులు, మహిళలు, వివిధ సమాజిక వర్గాల భాగస్వామ్యంతో వజ్రోత్సవ ర్యాలీలు
ఆగస్టు 14 : సాయంత్రం సాంస్కృతిక సారథి కళాకారుల చేత నియాజకవర్గ కేంద్రాల్లో ప్రత్యేక సాంస్క్రతిక జానపద కార్యక్రమాలు. ప్రత్యేకంగా బాణాసంచాతో వెలుగులు విరజిమ్మడం
ఆగస్టు 15 : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
ఆగస్టు 16 : ఏక కాలంలో, ఎక్కడివారక్కడ ’తెలంగాణ వ్యాప్తంగా సమూహిక జాతీయ గీతాలాపన. సాయంత్రం కవి సమ్మేళనాలు, ముషాయిరాల నిర్వహణ
ఆగస్టు 17 : రక్తదాన శిబిరాల నిర్వహణ
ఆగస్టు 18 : ఫ్రీడం కప్’ పేరుతో క్రీడల నిర్వహణ
ఆగస్టు 19 : దవాఖానాలు, వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలయాలు, జైల్లలో ఖైదీలకు పండ్లు స్వీట్ల పంపిణీ.
ఆగస్టు 20 : దేశభక్తిని, జాతీయ స్పూర్తిని ప్రకటించే విధంగా ముగ్గుల పోటీలు.
ఆగస్టు 21 : అసెంబ్లీ ప్రత్యేక సమావేశం. దాంతో పాటు ఇతర స్థానిక సంస్థల ప్రత్యేక సమావేశం.
ఆగస్టు 22 : ఎల్బీస్టేడియంలో వజ్రోత్సవ ముగింపు వేడుకలు.