Telangana Elections: తెలంగాణాలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం పోలింగ్ మందకొడిగా జరుగగా.. 11 గంటల వరకు 20.64 శాతం నమోదైంది. ఇక, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై కేంద్ర ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. సాయంత్రం 5.30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదల చేసుకోవచ్చని ప్రకటించింది. కాగా, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను సాయంత్రం 6.30 గంటల తర్వాత విడుదల చేయాలని గతంలో ఆదేశించిన ఎన్నికల సంఘం.. ఆ సమయంలో సరికొత్త మార్పులు చేసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది.