గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ లో పన్నుల పరంపర చిత్రవిచిత్రంగా కొనసాగుతోంది. ఆన్ లైన్ లోపాలతో వెబ్ సైట్లు పనిచేయకపోవడంతో ఖాళీ స్థలాలకు ఇంటి పన్నులు, ఇళ్లకు ఖాళీ స్థలాల పన్నులు వసూలు చేస్తున్నారు అధికారులు. ముఖ్యంగా సీడీఎంఏ వెబ్ సైట్ లోపాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. లోపాలను సరిదిద్దాల్సిన అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరించడంతో అందుబాటులో టెక్నాలజీ ఉన్నా ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. గుంటూరు కార్పొరేషన్ పరిధిలో ఇంటి పన్ను నిర్ధారించే వెబ్ సైట్ పనిచేయకపోవడంతో ప్రజలు…