Guntur Taxes: వెబ్ సైట్లో లోపాలు.. పన్నులు కట్టలేక కష్టాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ లో పన్నుల పరంపర చిత్రవిచిత్రంగా కొనసాగుతోంది. ఆన్ లైన్ లోపాలతో వెబ్ సైట్లు పనిచేయకపోవడంతో ఖాళీ స్థలాలకు ఇంటి పన్నులు, ఇళ్లకు ఖాళీ స్థలాల పన్నులు వసూలు చేస్తున్నారు అధికారులు. ముఖ్యంగా సీడీఎంఏ వెబ్ సైట్ లోపాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. లోపాలను సరిదిద్దాల్సిన అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరించడంతో అందుబాటులో టెక్నాలజీ ఉన్నా ప్రజలకు తిప్పలు తప్పడం లేదు.
గుంటూరు కార్పొరేషన్ పరిధిలో ఇంటి పన్ను నిర్ధారించే వెబ్ సైట్ పనిచేయకపోవడంతో ప్రజలు పెద్దఎత్తున ఇబ్బందులు పడుతున్నారు. ఆన్లైన్ లో ఖాళీ స్థలం నుంచి ఇంటి పన్ను మ్యుటేషన్ అయ్యే వెబ్ సైట్ గత ఏడు నెలల నుంచి పనిచేయడం లేదు. కార్పొరేషన్ లోని రెవెన్యూ విభాగానికి సంబంధించిన మరికొన్ని వెబ్ సైట్లు పనిచేయకపోవడంతో ప్రజలు ఇబ్బందితో పాటు నష్టాలకు గురవుతున్నారు. కావాలనే అధికారులు ఆదాయ వనరులు సమకూర్చుకునేందుకు ఆన్లైన్ సర్వీస్ లు నిలిపివేసారాన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Also Read
- CM Chandrababu: ఏపీలో 25 నుంచి 38కి ఎంపీ సీట్లు.. డీలిమిటేషన్‌పై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- CM Chandrababu: కేబినెట్ భేటీ తర్వాత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. డీలిమిటేషన్, అమరావతి, పెట్టుబడులపై ఏమన్నారంటే?
- CBN Flight Technical Issue: చంద్రబాబు ప్రత్యేక విమానంలో సాంకేతిక సమస్య.. హెలికాప్టర్లో హైదరాబాద్‌కు..!
- Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్‌పై కేబినెట్ కీలక నిర్ణయం.. PPP విధానంలో అప్పగింత..!
గత సంవత్సరం అక్టోబర్ నెల నుంచి ఖాళీ స్థలం నుంచి ఇంటిపన్నుకి మారే ఆన్లైన్ సర్వీస్ అందుబాటులో రాకపోవడంతో గుంటూరు నగరంలో ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లోని నివాస గృహాలు, గృహ సముదాయాలు నిర్మిస్తున్న గృహ యజమానులు బిల్డర్ ల నుండి నుంచి ప్లాట్లు కొనుగోలు చేసిన ఇంటి యజమానులు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు.సాధారణంగా ఒక ఇల్లు నిర్మించాలంటే ఇంటి స్థలానికి ఖాళీ స్థలం పన్ను వేయించాలి. తర్వాత బిల్డింగ్ ప్లాన్ టౌన్ ప్లానింగ్ అధికారులు మంజూరు చేస్తారు. ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత హౌస్ టాక్స్ అమల్లోకి వస్తుంది.
సాధారణంగా ఇంటి డాక్యుమెంట్ వ్యాల్యూ ని బట్టి ఆరు నెలలకు వంద గజాల ఖాళీ స్థలానికి సుమారు పదిలక్షల విలువకు 0.25 శాతం పన్ను చొప్పున టాక్స్ వేస్తారు. ఆరు నెలలకి 2500 రూపాయల టాక్స్ పడుతుంది. అదే వంద గజాల స్థలంలో ఇంటి పన్ను వేస్తే ఆరు నెలలకు వెయ్యి రూపాయలలోపు టాక్స్ ఉంటుంది. కానీ ఇప్పుడు గుంటూరు కార్పొరేషన్ పరిధిలో ఉన్న గోరంట్ల, పెదపలకలురు, ఇన్నర్ రింగ్ రోడ్డు లాంటి ఎక్స్టెంట్ ప్రాంతాలలో నిర్మించుకున్న భవనాలకు గతం లో మాదిరి గానే ఖాళీ స్థలాల పన్నులు పడుతున్నాయి. భవనాలు నిర్మించుకునేటప్పుడు ప్లానింగ్ తీసుకునేటప్పుడు తాము పన్నులు కట్టామని ఇప్పుడు భవనాలు నిర్మించుకున్నా సరే టాక్స్ ల మోత మోగిస్తున్నారని అంటున్నారు ప్రజలు.
https://ntvtelugu.com/prakasam-zp-meeting-viral/
ఈ తరహా అదనపు టాక్స్ కడుతున్న వాళ్లు గుంటూరు కార్పోరేషన్ పరిధిలో వేల సంఖ్యలో ఉన్నారు. ప్రతి నెల కార్పొరేషన్ కి వేకెంట్ లాండ్ నుండి హౌస్ టాక్స్ కన్వర్షన్ కి వచ్చే దరఖాస్తులు వందల సంఖ్యలో ఉంటున్నాయి. ఆన్లైన్ సర్వీస్ లు అందుబాటులో లేక పోవడంతో గత అక్టోబర్ నుండి ఈ తరహా కన్వర్షన్ దరఖాస్తు దారులు ఎదురు చూపులు చూస్తున్నారు. ఇంటి పన్ను వేస్తేనే ఆ ఇంటికి నీటి కుళాయి, డోర్ నంబర్ తో పాటు సచివాలయంలో మాపింగ్ వంటి సేవలు లభిస్తాయి. ప్రస్తుతం కన్వర్షన్ సైట్ ఆగి పోవడం తో ఒక్క మాటలో చెప్పాలి అంటే గృహాలు, గృహ సముదాయాలలో నివసించే ప్రజలు భవనం లేని స్థల యజమానిగా మిగిలిపోతారు . ఈ విషయం పై అధికారులను దరఖాస్తు దారులు ఎన్నిసార్లు అభ్యర్థించిన ఆన్లైన్ సైట్లు ఆగిపోతే మేమేం చేయాలంటూ సమాధానం వస్తుంది తప్ప దీనికి కారణం ఏంటో జవాబు లేని ప్రశ్నగా మిగిలిపోతుంది.
అయితే కార్పొరేషన్ల ఆదాయం పెంచుకోవటానికి రాష్ట్ర స్థాయి అధికారులు సైట్ నిలిపివేశారని, లేదంటే ఆరు నెలల కాలంగా ఒక వెబ్ సైట్ టెక్నికల్ ఎర్రర్ సరి దిద్దలేని పరిస్థితుల్లో అధికార యంత్రాంగం ఉందా ? అన్న అనుమానాలు ప్రజలలో వ్యక్తం అవుతున్నాయి. వీటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆన్లైన్ సర్వీస్ అందించే అధికారులపై వుంది.
తాజావార్తలు
-
Human Trafficking Case: పేద మహిళలే టార్గెట్.. అక్రమ ఎగ్ డొనేషన్ దందాలో బయటపడుతున్న సంచలన నిజాలు!
-
Kishan Reddy: ప్రతి ఇంట్లో ఇప్పుడు ‘నషా ముక్త్ భారత్’ గురించే చర్చ.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి!
-
CM Chandrababu: ఏపీలో 25 నుంచి 38కి ఎంపీ సీట్లు.. డీలిమిటేషన్‌పై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Chiranjeevi: మందు తాగమని ఒత్తిడి చేశారు.. ఆంజనేయుడి భక్తుడినని చెప్పా
-
Rohit Sharma vs Jasprit Bumrah: రోహిత్‌కు పగ్గాలు.. బుమ్రా వైస్ కెప్టెన్సీకి నో!.. ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్..!
ట్రెండింగ్
-
Shani Margi 2026: ఈ 3 రాశుల వారికి ఇక తిరుగులేని అదృష్టం.. ఆర్థికంగా పట్టిందల్లా బంగారమే!!
-
Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్‌కు మరోసారి షాక్.. ఆరేళ్ల అరుదైన రికార్డుకు బ్రేక్.. అయ్యో పాపం డీఎస్పీ!
-
రగ్గడ్ లుక్, 258 PS పవర్‌తో రాబోతున్న Nissan Terrano SUV..!
-
బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీతో హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ Ioniq M SUV ఆవిష్కరణ..!
-
999cc ఇంజిన్, 218hp పవర్.. BMW M 1000 RR సూపర్‌బైక్ భారత్ లో లాంచ్.!