గుంటూరులో చిన్నారి అదృశ్యం కలకలం సృష్టించింది… అరండల్ పేటలో ఆడుకుంటున్న చిన్నారిని ఓ మహిళ మాయమాటలు చెప్పి తీసుకెళ్లింది… ఉదయం కొడుకు కనిపించకపోవడంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది… సీసీ ఫుటేజ్ ఆధారంగా మహిళ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. గుంటూరు అరండల్ పేటకు చెందిన పోలమ్మ మున్సిపల్ కార్పోరేషన్ లో ఉద్యోగి. రైల్వేస్టేషన్ సమీపంలో నివాసం. పోలమ్మకు ఎనిమిదిమంది సంతానం. ఏడో సంతానమైన నాలుగేళ్ల చిన్నారి ప్రకాష్ రెండు రోజుల క్రితం అదృశ్యమయ్యాడు. ఈనెల 23న సాయంత్రం ఇంటిబయట ఆడుకునేందుకు బయటకు వచ్చాడు.
Read Also: Polavaram Project: పోలవరంపై ఎన్జీటీ తీర్పు…సుప్రీంకోర్టుకి ఏపీ సర్కార్
అన్నలతో కలిసి ఆరుబయట నిద్రపోతున్నాడని తల్లితండ్రులు భావించారు. తల్లిదండ్రులతో ఇంట్లో ప్రకాష్ ఉన్నాడని అన్నదమ్ములు భావించారు. ఉదయం ప్రకాష్ కనిపించకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆడుకుంటున్న తన కొడుకును ఆశచూపించి గుర్తుతెలియని మహిళ తీసుకెళ్లిందని తల్లి వాపోతోంది. మరోవైపు నాలుగేళ్ల ప్రకాష్ అదృశ్యమయ్యాడన్న ఫిర్యాదుతో పోలీసులు ఎలర్ట్ అయ్యారు. బాలుడు నివాసం ఉంటున్న ప్రాంతాల్లో సీసీ ఫుటేజ్ పరిశీలించారు.
గుర్తుతెలియని మహిళ వెంట బాలుడు ప్రకాష్ వెళ్తున్నట్లు సీసీ కెమేరాలో రికార్డయ్యింది. సీసీ ఫుటేజ్ చూసిన తల్లితండ్రులు మహిళను ఇప్పటివరకూ చూడలేదని చెప్పారు. దీంతో చిన్నపిల్లలను అపహరించే పాత నేరస్థులను విచారిస్తున్నారు. సీసీ కెమేరాలో రికార్డైన మహిళ పోలిలకతో ఉన్న మహిళ ఎవరనే దానిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. మహిళ ఆచూకీ తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పటికే పాత నేరస్థులను విచారిస్తున్న పోలీసులు బాలుడి ఫొటోతోపాటు గుర్తుతెలియని మహిళ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. వీలైనంత త్వరలో బాలుడు ఆచూకీ కనుగొంటామంటున్నారు.
Read Also: Samsung SmartPhones Sales: సీజన్ మొదటి రోజే ‘పండగ’ చేసుకున్న శామ్‌సంగ్