ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లా పేరు మార్పు వ్యవహారం తీవ్ర విధ్వంసానికి దారితీసింది.. అంబేద్కర్ పేరును ఆ జిల్లాకు జోడించడంపై ఓ వర్గం ఆందోళన చేస్తుండగా.. అంబేద్కర్ పేరును కొనసాగించాలంటూ దళితసంఘాలు నిరసనకు దిగుతున్నాయి.. అయితే, ఆంధ్రప్రదేశ్ పేరును కూడా మార్చేయాలంటూ సీబీఐ మాజీ డైరెక్టర్, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ మన్నెం నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరును “వైయస్సార్ ప్రదేశ్”గా మార్చమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి నా విన్నపం. అంటూ…