SRH vs RR : ప్లేఆఫ్స్‌లో రాజస్తాన్ రచ్చ.. ఎస్ఆర్హెచ్ ఔట్.!
- సూర్యవంశీ విధ్వంసం.. రాజస్తాన్ భారీ స్కోరు
- జురెల్ మెరుపులతో 243 పరుగుల పర్వతం
- ట్రావిషెక్ ఫెయిల్.. హైదరాబాద్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది
- ఆర్చర్ దెబ్బకు ఎస్ఆర్హెచ్ కథ ముగింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ ప్లేఆఫ్స్ (IPL Playoffs) ఉత్కంఠ పోరులో రాజస్తాన్ రాయల్స్ (RR) ఘనవిజయం సాధించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)తో జరిగిన కీలకమైన మ్యాచ్‌లో రాజస్తాన్ 47 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, క్వాలిఫైయర్-2 లో గుజరాత్ టైటాన్స్ (GT)తో తలపడేందుకు అర్హత సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 243 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం 244 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 19.2 ఓవర్లలో 196 పరుగులకే ఆలౌట్ అయి టోర్నీ నుంచి నిష్క్రమించింది.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ రాయల్స్‌కు ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఊహించని రేంజ్లో భారీ ఇన్నింగ్స్ ఆడి అండగా నిలిచాడు. కేవలం 29 బంతుల్లోనే 5 ఫోర్లు, ఏకంగా 12 సిక్సర్లతో 334.48 స్ట్రైక్ రేట్‌తో 97 పరుగులు చేసి సెంచరీ చేజార్చుకున్నాడు. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (29 బంతుల్లో 29) నెమ్మదిగా ఆడినా, సూర్యవంశీ విధ్వంసంతో తొలి వికెట్‌కు 125 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. ఆ తర్వాత వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ (21 బంతుల్లో 50, 5 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ధశతకం బాదగా, కెప్టెన్ రియాన్ పరాగ్ 26 పరుగులతో రాణించాడు. హైదరాబాద్ బౌలర్లలో ప్రఫుల్ హింగే 3 వికెట్లు తీశాడు.
Also Read
- India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
- Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
- IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
- World Cup 2027: 2027 ప్రపంచ కప్‌లో 'గ్రూప్ ఆఫ్ డెత్'గా గ్రూప్ బీ.. పాపం ఆ టీమ్ పరిస్థితి ఘోరం..
భారీ లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆరంభంలోనే చేతులెత్తేసింది. ఇన్నింగ్స్ రెండో బంతికే ఫామ్‌లో ఉన్న ఓపెనర్ అభిషేక్ శర్మ (0)ను జోఫ్రా ఆర్చర్ అవుట్ చేసి షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ 11 బంతుల్లోనే 3 సిక్సర్లు, 3 ఫోర్లతో 33 పరుగులు చేసి జోరు మీదున్నట్లు కనిపించినా ఆర్చర్ బౌలింగ్‌లోనే క్యాచ్ అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ (17)ను కూడా ఆర్చర్ క్లీన్ బౌల్డ్ చేయడంతో హైదరాబాద్ కోలుకోలేకపోయింది. మిడిల్ ఆర్డర్లో నితీష్ కుమార్ రెడ్డి (38), సలీల్ అరోరా (35), హెన్రిచ్ క్లాసెన్ (18) కాసేపు పోరాడినా రన్ రేట్ ఒత్తిడిలో వికెట్లు పారేసుకున్నారు. రాజస్తాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లతో హైదరాబాద్ నడుము విరవగా, నండ్రే బర్గర్, రవీంద్ర జడేజా తలో రెండు వికెట్లు పడగొట్టారు. చివరి ఓవర్లో శివాంగ్ కుమార్ (27) వికెట్‌ను సుశాంత్ మిశ్రా పడగొట్టడంతో హైదరాబాద్ ఇన్నింగ్స్ 196 పరుగుల వద్ద ముగిసింది.
తాజావార్తలు
-
India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..