OTR : కాంగ్రెస్ హామీల అమలు పోరాట పథంలో బీఆర్ఎస్.. విద్యార్థి నేతలు ఆగ్రహం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీఆర్ఎస్ అధిష్టానం పార్టీలో అత్యంత కీలకమైన ఆ వింగ్‌ని విస్మరించిందా? ప్రభుత్వంపై పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతున్న టైంలో… మమ్మల్ని పట్టించుకోవడం లేదని ఆ విభాగం నారాజ్ అవుతోందా? అసలు మా ప్రమేయం లేకుండా పార్టీకి పోరాటాలు సాధ్యమేనా అంటున్న ఆ విభాగం ఏది? అంతలా ఫ్రస్ట్రేట్ అయిపోవడానికి కారణాలేంటి? తెలంగాణలో బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వచ్చి రెండున్నర ఏళ్ళు అయ్యింది. దీంతో… ఇక రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజా పోరాటాలకు సిద్ధమవుతోంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, డిక్లరేషన్లను అమలు చేయాల్సిందేనంటూ పోరుబాట పట్టబోతోంది. ఇప్పటికే…. రైతు డిక్లరేషన్ అమలు డిమాండ్‌తో నిర్వహించిన సభ సక్సెస్ అయిందని భావిస్తున్న పార్టీ అధిష్టానం తాజాగా మరో అంశాన్ని ముందుకు తీసుకు వస్తోంది. ఎన్నికలకు ముందు రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌లో కాంగ్రెస్ పార్టీ చేసిన యూత్ డిక్లరేషన్‌ను వెంటనే అమలు చేయాలంటూ….దానిపై పోరాటానికి సిద్ధమవుతోంది ప్రతిపక్షం. వరంగల్‌లో లాగానే చలో సరూర్ నగర్ పేరుతో పెద్ద బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు. యూత్ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులను మోసం చేసిందని, విద్యార్థులకు ఫీజు రీ ఇంబర్స్మెంట్ కూడా అమలు చేయలేదని విమర్శిస్తోంది బీఆర్ఎస్. ఇదే విషయాన్ని బహిరంగ సభ వేదిక ద్వారా చెబుతామని ప్రకటించారు పాత జీహెచ్ఎంసీ పరిధిలోని గులాబీ ఎమ్మెల్యేలు. అంత వరకు బాగానే ఉన్నా… అసలు సమస్య అక్కడే మొదలైంది. యూత్ డిక్లరేషన్ అమలుకోసం ప్రభుత్వం మీద చేయబోయే పోరాటంలో… యువతగా మా స్థానం ఎక్కడ అని ప్రశ్నిస్తోంది బీఆర్ఎస్ విద్యార్థి విభాగం.
ఆ పోరాటానికి సంబంధించిన సన్నాహక సమావేశం తాము లేకుండానే జరిగిపోయిందంటూ అసంతృప్తిగా ఉన్నారట బీఆర్ఎస్వీ నేతలు. యూత్ డిక్లరేషన్ పోరాటంలో ప్రధానంగా విద్యార్థులకు సంబంధించిన సమస్యలపైనే మాట్లాడాలి. అలాంటిది పార్టీకి సంబంధించిన విద్యార్థి సంఘం నేతలు లేకుండా ఎమ్మెల్యేలు సన్నాహక సమావేశం నిర్వహించడం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. తెలంగాణ భవన్లో రెండు రోజుల క్రితం ఏర్పాటుచేసిన సమావేశంలో కేవలం సిటీ ఎమ్మెల్యేలు మాత్రమే పాల్గొన్నారు. తీసుకున్న నిర్ణయాలను ఆ తర్వాత మీడియా ముందు ప్రకటించారు. ఇక్కడే తమను ఎందుకు విస్మరించారని ప్రశ్నిస్తున్నారట బీఆర్ఎస్వీ నాయకులు. మెయిన్ మీటింగ్‌కు పిలవకున్నా… కనీసం మీడియా సమావేశానికైనా తమని పిలిస్తే బాగుండేదన్నది వాళ్ళ అభిప్రాయం. పార్టీకి సంబంధించి ఏ యాక్టివిటీ చేసినా… అందరికంటే ముందు ఉండేది విద్యార్థి విభాగమేనని, ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న విద్యార్థి నేతల మీద ఇప్పటికే పదుల సంఖ్యలో కేసులు కూడా నమోదయ్యాయని గుర్తు చేస్తున్నారు. అలా కేసులకు, పోరాటాలకు మమ్మల్ని పంపించి పార్టీ తీసుకునే కీలక నిర్ణయాల్లో మాత్రం భాగస్వామ్యం లేకుండా చేస్తారా అని మండిపడుతున్నట్టు సమాచారం. అయితే ఇది యూత్ డిక్లరేషన్‌కు సంబంధించిన అంశం కాబట్టి పార్టీ యూత్ వింగ్నే పిలిచామని, విద్యార్థి విభాగానికి సంబంధించిన కొందరు నేతలకు ఫోన్ చేసినప్పటికీ అందుబాటులో లేరని చెబుతున్నారు శాసనసభ్యులు. అయితే….ఇదే అంశంపై ఈనెల 30న కేటీఆర్ సమక్షంలో జరిగే సన్నాహక సమావేశానికి మమ్మల్ని కచ్చితంగా పిలవాల్సిందేనని డిమాండ్ చేస్తోంది విద్యార్థి విభాగం. కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటంలో పార్టీ నుంచి స్టూడెంట్స్ వింగే ముందుంటుందని, అలాంటిది తమకు తెలియకుండా కార్యక్రమం జరగడం బాధగా ఉందని అంటున్నారు విద్యార్థి నాయకులు.
Also Read
- Tags
- BRS
- NTV Telugu
- off the record
తాజావార్తలు
-
Gandhi Jayanti: బాపూఘాట్లో మహాత్ముడికి సీఎం రేవంత్, గవర్నర్ ఘన నివాళులు..
-
FASTag నిబంధనల్లో కీలక మార్పులు.. వారికి గుడ్‌న్యూస్..
-
Lal Bahadur Shastri Jayanti: నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం.. ‘జై జవాన్ జై కిసాన్’ రూపశిల్పి శాస్త్రి జీ..
-
Vivo T5 Lite 5G, T5 Pro 5G: వివో T5 Lite 5G, వివో T5 Pro 5G కొత్త RAM, స్టోరేజ్ వేరియంట్లు విడుదల.. ధరలు, ఫీచర్లు ఇవే
-
Harbhajan Singh: అతడు మరింత పదునెక్కుతున్నాడు.. ఈ వయసులోనే ఆ ఘనతలు అసాధ్యం!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?