Sun Risers Hyderabad: పెవిలియన్‌కు క్యూ కట్టిన కాటేరమ్మ కొడుకులు.. కుప్పకూలిన టాప్ ఆర్డర్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ నిర్దేశించిన 244 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలిపోయింది. ‘కాటేరమ్మ కొడుకులు’ అంటూ సోషల్ మీడియాలో భారీ హైప్ తెచ్చుకున్న హైదరాబాద్ పవర్‌హౌస్ టాప్ ఆర్డర్ బ్యాటర్లు, రాజస్థాన్ స్పీడ్‌స్టర్ జోఫ్రా ఆర్చర్ నిప్పులు చెరిగే బౌలింగ్ దాటికి క్రీజులో నిలవలేక పెవిలియన్‌కు క్యూ కట్టారు. కేవలం 5.1 ఓవర్లలోనే 63 పరుగులకే 4 ముఖ్యమైన వికెట్లు కోల్పోయి హైదరాబాద్ కోలుకోలేని దెబ్బతింది. ప్రస్తుతం పవర్ ప్లే ముగిసే సరికి హైదరాబాద్ 4 వికెట్ల నష్టానికి 71 పరుగులు పూర్తి చేశారు.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్‌కు మొదటి ఓవర్లోనే షాక్ తగిలింది. ఓపెనర్ అభిషేక్ శర్మ ఎదుర్కొన్న రెండో బంతికే జోఫ్రా ఆర్చర్ వేసిన బౌలింగ్‌లో ధ్రువ్ జురెల్‌కు క్యాచ్ ఇచ్చి డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత డేంజర్ మ్యాన్ ట్రావిస్ హెడ్ 8 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్‌తో 17 పరుగులు చేసి ఊపు మీదున్నట్లు కనిపించినా, అతడిని కూడా ఆర్చర్ క్లీన్ బౌల్డ్ చేసి క్లీన్ స్వీప్ చేశాడు. దీంతో సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ ఒక్కసారిగా డిఫెన్స్‌లో పడింది.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
మరోవైపు వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఒంటరి పోరాటం చేస్తూ కేవలం 11 బంతుల్లోనే 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 33 పరుగులు బాది రన్‌రేట్‌ను పెంచే ప్రయత్నం చేశాడు. కానీ, జోఫ్రా ఆర్చర్ మూడో ఓవర్లో ఇషాన్ కిషన్‌ను కూడా ఫెరీరా చేతికి క్యాచ్ చిక్కేలా చేసి సన్‌రైజర్స్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. కేవలం 3 ఓవర్లలో 42 పరుగులు ఇచ్చినప్పటికీ, ప్రత్యర్థి జట్టుకు వెన్నుముక లాంటి 3 కీలక వికెట్లను ఆర్చర్ పడగొట్టడం విశేషం.
ఇక ఆర్చర్‌కు తోడుగా నండ్రే బర్గర్ కూడా లైనప్‌ను దెబ్బతీశాడు. వన్‌డౌన్‌లో వచ్చిన స్మరణ్ రవిచంద్రన్ (1) బర్గర్ బౌలింగ్‌లో ఆర్చర్‌కే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో పవర్‌ప్లే ముగియక ముందే 63 పరుగులకే సన్‌రైజర్స్ హైదరాబాద్ 4 వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో పడింది. ప్రస్తుతం క్రీజులో హెన్రిచ్ క్లాసెన్ (4), నితీష్ కుమార్ రెడ్డి (2) ఉన్నారు. హైదరాబాద్ ఈ మ్యాచ్‌లో నిలవాలంటే ఈ జోడి అద్భుతం చేయాల్సిందే.
తాజావార్తలు
-
The Paradise : ఈరోజు నుండి నాని సినిమా అసలు రంగు ఏంటో తెలియనుందా?
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
World Rabies Day 2026: కుక్క కాటు నుంచి ఎలా తప్పించుకోవాలి?.. WHO సూచించిన ముఖ్యమైన జాగ్రత్తలు
-
Virat Kohli: నాకు నేనే ప్రామిస్ చేసుకున్నా.. ఇకపై అలా ఆడతా.. కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
India vs Afghanistan: భారత్‌కు కలిసొచ్చిన వర్షం.. మ్యాచ్ ఆడకుండానే సెమీస్‌కు దూసుకెళ్లిన టీమిండియా..!
ట్రెండింగ్
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!