Ragi Ponganalu: మహిళలకు అమృతం లాంటిది.. ఐరన్, క్యాల్షియం కావాలంటే వారంలో రెండుసార్లు ఇవి తినండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ragi Ponganalu: ఈ రోజుల్లో హెల్తీ లైఫ్‌స్టైల్, సాంప్రదాయ ఆహారాలపై జనాల ఆసక్తి చాలా పెరిగింది. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు, ఐరన్ లోపం (అనీమియా), జుట్టు రాలడం వంటి సమస్యలతో బాధపడేవారికి ‘రాగులు’ ఒక అద్భుతమైన ఛాయిస్‌గా పని చేస్తున్నాయి. అయితే రోజూ రాగి జావ లేదా రాగి సంకటి తింటే బోర్ కొడుతుంది అనుకునే వారి కోసం.. కేవలం 10 నిమిషాల్లో ఎంతో రుచిగా, క్రిస్పీగా తయారు చేసుకోగలిగే ‘రాగి పొంగణాలు’ (Ragi Ponganalu) రెసిపీని సింపుల్‌గా ఎలా చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
నిజానికి రాగి పొంగణాలు అనేవి రక్తహీనత, జుట్టు రాలడం, అధిక బరువు.. ఇలాంటి సమస్యలన్నింటికీ చెక్ పెట్టే సూపర్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్. వీటిని పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తినేలా, కేవలం పదే పది నిమిషాల్లో ఈ గుంత పొంగణాలను ఎలా తయారు చేసుకోవాలంటే..
Also Read
- Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే "వెజ్ ఆమ్లెట్".. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
- Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
- Kakarakaya Vepudu: అన్నంలోకి 'కాకరకాయ వేపుడు'.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
- Eye Health: తరచూ హెడేక్ వస్తోందా? ఎప్పుడు అలర్ట్ కావాలి? వైద్యుల సలహా ఇదే!
కావలసిన పదార్థాలు:
రాగి పిండి – 1 కప్పు
బొంబాయి రవ్వ (ఉప్మా రవ్వ) – 1 కప్పు
పెరుగు – 1 కప్పు
ఉల్లిపాయ – 1 (సన్నగా తరిగినది)
క్యారెట్ తురుము – 1 కప్పు
పచ్చిమిర్చి – 3 (సన్నగా తరిగినవి)
జీలకర్ర – 1 టేబుల్ స్పూన్
కొత్తిమీర – కొద్దిగా
వంట సోడా – పావు స్పూన్
ఉప్పు – రుచికి సరిపడా
నూనె – పొంగణాల ఫ్రైకి సరిపడా
తయారీ విధానం
ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు రాగి పిండి, ఒక కప్పు బొంబాయి రవ్వ, ఒక కప్పు పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, ఒక చెంచా జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసి అన్ని కలిసేలా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమంలో కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ.. పిండిని మరీ పల్చగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా సాధారణ పొంగణాల పిండి లాగా కలుపుకోవాలి. రవ్వ నానుతుంది కాబట్టి ఒక 10 నిమిషాల పాటు ఈ పిండిని పక్కన పెట్టుకోవాలి.
పొంగణాలు వేసుకునే ముందు పిండిలో పావు స్పూన్ వంట సోడా (బేకింగ్ సోడా) వేసి ఒక్కసారి బాగా కలుపుకోవాలి. దీనివల్ల పొంగణాలు లోపల మెత్తగా, పైన క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గుంత పొంగణాల పెనం (Appam Pan) పెట్టుకుని, అన్ని గుంతల్లో కొద్దికొద్దిగా నూనె వేయాలి. పెనం వేడెక్కిన తర్వాత స్పూన్‌తో పిండిని తీసుకొని గుంతల్లో వేసుకోవాలి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌పై రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు క్రిస్పీగా కాల్చుకోవాలి. అంతే.. ఎంతో రుచికరమైన, వేడివేడి హెల్తీ రాగి పొంగణాలు రెడీ అయిపోతాయి.
రాగుల్లో క్యాల్షియం, ఐరన్ – ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మహిళల్లో వచ్చే అనీమియా (రక్తహీనత) సమస్యను తగ్గించడానికి, జుట్టు కుదుళ్లను బలంగా మార్చడానికి ఈ రాగి పొంగణాలు అద్భుతంగా పనిచేస్తాయి. వీటిని అల్లం చట్నీ లేదా పల్లీల చట్నీతో తింటే టేస్ట్ అదిరిపోతుంది.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
-
OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!