కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై ఇంకా ఆందోళనలు కొనసాగుతున్నాయి. న్యాయం చేయాలంటూ వైద్యులు వైద్యులు నిరసనలు కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆర్‌జీ కర్ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌కు సీబీఐ కోర్టు షాకిచ్చింది.
Kolkata Doctor Rape Case: కోల్‌కతాలో జూనియర్ డాక్టర్ హత్యాచారం కేసులో మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్, పోలీస్ అధికారి అభిజిత్ మోండల్‌లకు మరో మూడు రోజుల పాటు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ సిటీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేసింది. పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు చోటుచేసుకున్నాయి. అనంతరం ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించింది. ప్రస్తుతం ఈ కేసును దర్యాప్తు అధికారులు లోతుగా విచారిస్తున్నారు. ఇక ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో జరిగిన ఆర్థిక అవకతవకలపై మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌ను ఎనిమిది రోజులు సీబీఐ కస్టడీకి న్యాయస్థానం అప్పగించింది.
MLC Kavitha: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మూడు రోజుల కస్టడీ నేటితో ముగిసింది. సీబీఐ అధికారులు ఆమెను ఇవాళ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నారు.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. సీబీఐ అభ్యర్థన మేరకు రౌస్ అవెన్యూ కోర్టు ఆమెకు 3 రోజుల కస్టడీ విధించింది. దీంతో ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న కవితను సీబీఐ తమ కస్టడీలోకి తీసుకుని విచారించనుంది.
అవినీతి ఆరోపణలు రావడంతో మంత్రి పదవికి రాజీనామా చేసిన మహారాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌ను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి.. తాజాగా అవినీతి కేసులో సీబీఐ అనిల్ దేశ్‌ముఖ్‌ను అరెస్ట్ చేయగా.. ఇక, ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలు నుండి ఆయన్ని కస్టడీలోకి తీసుకుంది సీబీఐ… అవినీతి కేసులో అరెస్ట్ అయిన అనిల్ దేశ్‌ముఖ్‌ను.. తమ కస్టడీకి ఇవ్వాలంటూ సీబీఐ చేసుకున్న దరఖాస్తును సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం అనుమతించగా.. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణకు…