సినిమాటోగ్రఫీ సవరణ బిల్లుపై చర్చ వేడెక్కుతున్న తరుణంలో టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు స్పందించారు. ఈ బిల్లు వస్తే ఇక సిబిఎఫ్‌సి ఎందుకు? అని ప్రశ్నించారు. “ఇప్పటికే సినిమాను టార్గెట్ చేయడం ఈజీగా మారింది. అయితే #సినిమాటోగ్రాఫ్ బిల్ దానిని ఇంకా సులభం చేస్తుంది. భావ ప్రకటనా స్వేచ్ఛ అనే రాజ్యాంగ హక్కును మనం కోల్పోకూడదు. మాకు భయం కలిగించే వాతావరణం అక్కరలేదు. రీ సెన్సార్ అనే ఆలోచన ఉంటే ఇక సిబిఎఫ్‌సి ఉండటం వల్ల…
బాల నటుడిగా, యువ హీరోగా, తెలుగు, మలయాళ చిత్రాల్లో నటించిన కౌశిక్ బాబు కేంద్ర ప్రభుత్వ సమాచార, ప్రసార శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సి.బి.ఎఫ్.సి), హైదరాబాద్ అడ్వయిజరీ బోర్డ్ మెంబర్ గా నియమితులయ్యారు. దీని కాలపరిమితి రెండు సంవత్సరాలు. అయ్యప్ప మహత్యం, షిరిడీ సాయి, శ్రీ రాఘవేంద్ర స్వామి వంటి చిత్రాల్లో నటించిన కౌశిక్ బాబు బాల నటునిగా నంది పురస్కారం అందుకున్నారు. ప్రముఖ పాత్రికేయుడు శ్రీ విజయబాబు తనయుడే కౌశిక్…