సినిమాటోగ్రఫీ సవరణ బిల్లుపై చర్చ వేడెక్కుతున్న తరుణంలో టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు స్పందించారు. ఈ బిల్లు వస్తే ఇక సిబిఎఫ్‌సి ఎందుకు? అని ప్రశ్నించారు. “ఇప్పటికే సినిమాను టార్గెట్ చేయడం ఈజీగా మారింది. అయితే #సినిమాటోగ్రాఫ్ బిల్ దానిని ఇంకా సులభం చేస్తుంది. భావ ప్రకటనా స్వేచ్ఛ అనే రాజ్యాంగ హక్కును మనం కోల్పోకూడదు. మాకు భయం కలిగించే వాతావరణం అక్కరలేదు. రీ సెన్సార్ అనే ఆలోచన ఉంటే ఇక సిబిఎఫ్‌సి ఉండటం వల్ల ఉపయోగం ఏమిటి?” అంటూ ట్వీట్ చేశారు. వాడి వేడిగా చర్చ జరుగుతున్న ఈ అంశంపై ఒక్క రామ్ గోపాల్ వర్మ తప్ప ఇప్పటివరకూ ఎవరూ నోరు మెదపలేదు. దీంతో పలువురు టాలీవుడ్ స్టార్స్ పై మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో సుధీర్ బాబు ఒకడుగు ముందుకేసి సినిమాటోగ్రఫీ బిల్ ను వ్యతిరేకిస్తూ ట్వీట్ చేశారు. మరి ఇప్పటికైనా మన స్టార్ హీరోలు ఈ విషయంపై ధైర్యంగా తమ గళం విప్పుతారా ? అనేది చూడాలి.
Read Also : రామ్ చరణ్, శంకర్ మూవీ షూటింగ్ కు ముహూర్తం ఫిక్స్ ?
కాగా భారత ప్రభుత్వం తాజాగా చేసిన సినిమాటోగ్రఫీ సవరణ వల్ల భావ ప్రకటనా స్వేచ్ఛకు భారీ దెబ్బ తగలనుంది. దీనివల్ల 1952 నాటి సినిమాటోగ్రఫీ చట్టాన్ని అనుసరించి సెన్సార్ బోర్డ్ క్లీన్-చిట్ ఇచ్చిన చిత్రాలను తిరిగి కేంద్ర ప్రభుత్వం సినిమాలను రీఎగ్జామ్ చేసే అధికారం రానుంది. అంటేపరోక్షంగా సెన్సార్ బోర్డు నుండి క్లియరెన్స్ పొందిన ఏ చిత్రంనైనా నిషేధించటం లేదా చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఏర్పడుతుంది. ఈ బిల్లుకు వ్యతిరేకంగా బాలీవుడ్ నుండి అనురాగ్ కశ్యప్, హన్సాల్ మెహతా, ఫర్హాన్ అక్తర్, షబానా అజ్మీ, దిబాకర్ బెనర్జీతో మరికొందరు ఈ బిల్లు అమలు చేయవద్దని ప్రభుత్వాన్ని కోరుతూ బహిరంగంగా లేఖ రాశారు. దక్షిణాదిన కూడా తమిళ చిత్ర పరిశ్రమ ప్రముఖులు తమ గొంతు పెంచారు. కమల్ హాసన్, సూర్య, గౌతమ్ మీనన్, పిసి శ్రీరామ్ సోషల్ మీడియాలో సినిమాటోగ్రఫీ యాక్ట్ పై ప్రభుత్వ ప్రతిపాదనను నిరసించారు.
While cinema is already an easy target, the #Cinematographbill makes it much easier to target. We should not be deprived of a constitutional right called freedom of expression. We don't want an atmosphere of fear. What's the use of having a CBFC if there's a concept of re-censor?
— Sudheer Babu (@isudheerbabu) July 4, 2021