Section 144 imposed in Karnataka over Cauvery Issue: కర్ణాటకలో నేడు రాష్ట్ర బంద్ కొనసాగుతోంది. తమిళనాడుకు కావేరి నీటి విడుదలను వ్యతిరేకిస్తూ.. కన్నడ, రైతు సంఘాలు పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్ ఉద్ధృతంగా కొనసాగుతోంది. ఈ బంద్‌కు మద్దతుగా హోటళ్లు, విద్యా-వ్యాపార సంస్థలు, సినిమా థియేటర్లు, మాల్స్, ప్రైవేటు సంస్థలు అన్నీ మూతబడ్డాయి. మరోవైపు బస్సులు డిపోలకే పరిమితం కాగా.. ట్యాక్సీలు, ఆటోలు కూడా నిలిచిపోయాయి. ఇక బెంగళూరు విమానాశ్రయంలో శుక్రవారం ఉదయం 44 విమాన…