హర్యానాలోని ఝజ్జర్‌లో రెండు ట్రక్కులు ప్రమాదానికి గురై మంటల్లో చిక్కుకున్నాయి. రెండు వాహనాలు బలంగా ఢీకొనడంతో వేగంగా మంటలు వ్యాపించి అగ్నికి ఆహుతి అయ్యాయి. వాహనాలు పూర్తిగా కాలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా సంఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.
ఇది కూడా చదవండి: Pavitra Gowda : హీరో దర్శన్ ప్రియురాలు పవిత్ర మొదటి భర్త ఎవరో తెలుసా?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రమాదంలో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని బీరి-ఝజ్జర్ ఎస్‌హెచ్‌వో అమిత్ కుమార్ తెలిపారు. ఒకదానికొకటి ఢీకొనగానే మంటలు చెలరేగాయని చెప్పారు. ప్రమాదం జరగగానే డ్రైవర్లు వాహనం నుంచి దిగేయడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. మంటలు కారణంగా సమీప ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడారు. అంతేకాకుండా ఇరువైపులా వాహనాలు కూడా భారీగా నిలిచిపోయాయి. మంటలను అదుపులోకి తీసికొచ్చాక.. వాహనాల రాకపోకలను పోలీసులు పునరుద్ధరించారు.
ఇది కూడా చదవండి: Rahul gandhi: రాయ్‌బరేలీ, వయనాడ్‌పై సాయంత్రం కీలక ప్రకటన
#WATCH | Two trucks met with an accident and caught fire in Haryana's Jhajjar
More details awaited. pic.twitter.com/AcLnuBTtre
— ANI (@ANI) June 17, 2024
#WATCH | Jhajjar, Haryana: 2 dumpers have collided with each other. Fire broke out after the collision. Efforts are being made to extinguish the fire. No one has lost their life in the accident: Amit Kumar, SHO Beri, Jhajjar https://t.co/1oAWTRFNex pic.twitter.com/JfYRAkYd5x
— ANI (@ANI) June 17, 2024