తెలంగాణలో 13 రోజుల పాటు కులగణన రీ సర్వే జరిగింది. ఈ సర్వేలో కూడా ఆశించిన సంఖ్యలో కుటుంబాలు తమ వివరాలు నమోదు చేసుకోలేదు. మొదటిసారి నిర్వహించిన కుల గణన సర్వేలో 3.56 లక్షల కుటుంబాలు వివరాలు నమోదుచేసుకోకుండా మిగిలిపోయాయి. ఈ క్రమంలో ప్రభుత్వం రీ సర్వే చేపట్టింది. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. రెండో విడత కుల గణనకు తక్కువ స్పందన వచ్చిందని తెలిపారు.