CM Revanth Reddy: కుల గణన.. దేశ సామాజిక ముఖచిత్రాన్ని మార్చే సాహసమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్విటర్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపట్టడం ఆనందం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కులగణన కార్యక్రమం తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ ప్రారంభమైందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంపై రేవంత్ రెడ్డి స్పెషల్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. దీనిపై సీఎం.. ఆకాశం -భూమి ఏకమై, అవకాశాల్లో సమానత్వం, అణగారిన వర్గాల సామాజిక న్యాయం కోసం చేస్తోన్న యజ్ఞం ఇదని తెలిపారు. అలాగే నేడు తెలంగాణ గడ్డ పై మొదలై.. రేపు రాహుల్ సారథ్యంలో దేశ సామాజిక ముఖచిత్రాన్ని మార్చే సాహసం ఇది అని వ్యాఖ్యానించారు.
ఆకాశం – భూమి ఏకమై…
అవకాశాల్లో సమానత్వం…
అణగారిన వర్గాల
సామాజిక న్యాయం కోసం…
చేస్తోన్న యజ్ఞం ఇది.నేడు తెలంగాణ గడ్డ పై మొదలై…
రేపు రాహుల్ సారథ్యంలో
దేశ సామాజిక ముఖచిత్రాన్ని మార్చే సాహసం ఇది.#TelanganaPrajaPrabhutwam #prajapalana pic.twitter.com/oeYYrxK5Ve— Revanth Reddy (@revanth_anumula) November 6, 2024
కాగా.. గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ పరిధిలోని గ్రామాల పేర్లు కోడ్ రూపంలో సేకరించబడతాయి. ఇంటి జాబితాలో వార్డు నంబర్, ఇంటి నంబర్, వీధి పేరు కూడా నమోదు చేయబడ్డాయి. ప్రతి ఇంటికి ఒక స్టిక్కర్ జతచేయబడుతుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేటి (బుధవారం) నుంచి శిక్షణ పొందిన ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వెళ్లి సర్వే చేయనున్నారు. ఈ సర్వేలో ప్రజల సామాజిక, విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ వివరాలను సేకరించనున్నారు. ఈ సర్వే కోసం 75 ప్రశ్నల ఫార్మాట్‌ను సిద్ధం చేశారు. ఈ ప్రశ్నలు రెండు భాగాలుగా ఉంటాయి. కాగా.. 8 పేజీల్లో ఆయా వివరాలను ఎన్యూమరేటర్లు నమోదు చేస్తారు.
Read also: Benjamin Netanyahu: డొనాల్డ్ ట్రంప్‌కి శుభాకాంక్షలు తెలిపిన ఇజ్రాయెల్ ప్రధాని
మరోవైపు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో సమగ్ర కుటుంబ సర్వేను ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే కార్యక్రమాన్ని రంగారెడ్డి జిల్లాకు సంబంధించి శంకరపల్లి లో ప్రారంభించడం జరిగిందని శ్రీధర్ బాబు తెలిపారు. ఈ సర్వే ముఖ్య ఉద్దేశం ప్రతి వ్యక్తి ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, కుల పరంగా పూర్తి సమాచారాన్ని సేకరిస్తారని తెలిపారు. ఈ యొక్క సర్వే ఈనెల 30 తారీకు వరకు కొనసాగుతుంది సర్వే చేసిన ఇనుమురెటర్ పూర్తి సమాచారాన్ని మీ ఇంటి గోడకు అతికించడం జరుగుతుంది.
ఏమైనా తప్పులు ఉంటే దగ్గరలోని ఎమ్మార్వో కు కాని, ఆర్డీవో కు కాని, లేదా కలెక్టర్ కు కాని సమాచారమించి తప్పులు దొరకకుండా సరి చేసుకోవాల్సింది ఆయన తెలిపారు.ప్రతి ఒక్కరు అధికారులకు సమగ్ర సమాచారం ఇవ్వలన్నారు, ఈ సమాచారం ప్రభుత్వానికి మరిన్ని పథకాలను ప్రవేశపెట్టడానికి ఉపయోగపడుతుందని అన్నారు. 150 ఇండ్లకు గాను ఒక ఇనుమురెటర్ ను నియమించి వారు ప్రతి ఇంటి సమాచారాన్ని సేకరిస్తారని తెలిపారు. ప్రజలు ఎటువంటి అపోహలకు గురికావొద్దు, ప్రజలకు ప్రస్తుతం అందుతున్న పథకాలు కొనసాగుతాయి, రద్దు చేస్తారనే మాటలు నమ్మొద్దు అని సూచించారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించాలని ఆయన కోరారు.
Benjamin Netanyahu: డొనాల్డ్ ట్రంప్‌కి శుభాకాంక్షలు తెలిపిన ఇజ్రాయెల్ ప్రధాని