Rythu Runa Mafi: తెలంగాణ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రెండో విడత రుణమాఫీ పై అప్డేట్ ఇచ్చింది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండో విడత రుణమాఫీ నగదు బదిలీని లాంఛనంగా ప్రారంభించనున్నారు.
Election Code: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా తనిఖీల్లో భారీగా నగదు, బంగారం పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలో నగదు, బంగారం, ఇతర విలువైన వస్తువులను రవాణా చేసేటపుడు ఆధారాలతో సహా తీసుకెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. సరైన ఆధారాలు, పత్రాలు లేకుండా నగదు, బంగారం తరలిస్తే తప్పనిసరి కేసులు పెట్టే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. చెక్కు, డీడీ, ఆర్‌టీజీఎస్, నిఫ్ట్, ఆన్‌లైన్ పద్ధతుల్లో ఖాతాలోకి నగదు బదిలీ చేసుకునే వెసులుబాటు ఉన్నా… డబ్బు ఎందుకు, ఎక్కడికి తీసుకెళ్తున్నారో ప్రూఫ్‌లు…
ఆంధ్రప్రదేశ్‌లో రేషన్‌కార్డుదారులకు రేషన్ బియ్యానికి బదులు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధం అయ్యింది ప్రభుత్వం.. బియ్యం తీసుకోవాలా, డబ్బులు తీసుకోవాలా అనేది లబ్ధిదారుల ఇష్టమని తెలిపింది.. అయితే, ఇప్పుడు నగదు బదిలీని వాయిదా వేసినట్టు తెలిపారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.. పౌర సరఫరాల శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు మంత్రి.. 26 జిల్లాల జేసీలు, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో.. రేషన్ కార్డుదారులకు నగదు బదిలీని ప్రస్తుతానికి పక్కన పెట్టినట్టు వెల్లడించారు.. యాప్‌లో సాంకేతిక లోపం…
రేషనుకు నగదు బదిలీపై సోము వీర్రాజు వ్యాఖ్యలు అర్థరహితం అన్నారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. 2017లో కేంద్రం తెచ్చిన పథకాన్నే ఏపీలో అమలుచేస్తున్నాం. సోము వీర్రాజు పథకం గురించి ప్రధాని మోడీని అడగాలి. రేషన్ బియ్యానికి నగదు చెల్లింపుల పథకాన్ని విమర్శించడమంటే మోడీని విమర్శించినట్లే అన్నారు. రేషన్ బియ్యానికి నగదు బదిలీపై ఎలాంటి ఒత్తిడి లేదు. బలవంతంగా ఎవరి మీదా నగదు బదిలీ అమలు చేసేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వంపై కావాలనే సోము వీర్రాజు ఆరోపణలు…